షాకింగ్ ఇన్సిడెంట్... స్టార్ హోటల్‌లో హీరోయిన్‌కు పురుగుల భోజనం పెట్టారు!
ఈ రోజుల్లో బయటి ఫుడ్ తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. తప్పనిసరి తినాల్సి వచ్చినపుడు చాలా మంది కాస్త ఖర్చు ఎక్కువైనా సరే మంచి హోటల్ సెలక్ట్ చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో రిస్క్ తీసుకోవడానికి సాహసించరు.
సినిమా సెలబ్రిటీలు, ప్రముఖులు ప్రైవసీతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ మొత్తం చెల్లించి స్టార్ హోటల్స్‌లో స్టే చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే తాజాగా ఓ హీరోయిన్‌కు అహ్మదాబాద్‌లోని స్టార్ హోటల్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది.

భోజనంలో పురుగులు చూసి షాకైన మీరా చోప్రా
హీరోయిన్ మీరా చోప్రా ఇటీవల ఏదో పని మీద అహ్మదాబాద్ వెళ్లినపుడు అక్కడి ఓ స్టార్ హోటల్‌లో బస చేశారు. రూమ్ సర్వీస్‌కు ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే వారు తెచ్చిన ప్లేట్లో వార్మ్స్(తెల్ల పురుగులు) కదులుతూ కనిపించడం చూసి షాకైంది. వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ వీడియో షేర్ చేసింది.

భారీగా డబ్బు చెల్లించాను, ఈ ఫుడ్ చూసి షాకయ్యా
మనం భారీగా డబ్బు చెల్లించి స్టార్స్ హోటల్స్‌లో బస చేసేది సేఫ్టీ అండ్ హెల్త్ కోసమే. కానీ వీరు ఇలా పురుగులతో కూడిన ఫుడ్ నాకు సర్వ్ చేశారు. ఈ విషయం అందరికీ తెలియాలనే ముందుగా ఈ వీడియో మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా బయట హోటల్‌లో ఏదైనా తినేపుడు ఒకసారి చూసుకోండి.... అని మీరా చోప్రా తెలిపారు.
fssai_safefood కి ఫిర్యాదు
ఈ విషయమై మీరా చోప్రా fssai_safefood వారికి ఫిర్యాదు చేసింది. ఈ హోటల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇలాంటి విషయాలను ఊరికే వదిలేస్తే వారి నిర్లక్ష్యం మరింత ఎక్కువ అవుతుందని మండి పడ్డారు.

మీరా చోప్రా
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘బంగారం' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మీరా చోప్రా... వాన, మారో, గ్రీకు వీరుడు అనే చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో నాస్తిక్, సెక్షన్ 375, తెలుగులో మొగలి పువ్వు చిత్రాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











