Meera Jasmine: భద్ర హీరోయిన్ మళ్ళీ స్టన్ అయ్యేలా చేసిందిగా.. ఎద అందాలతో మరింత ఘాటుగా..
ఒకప్పుడు చూడగానే చిరునవ్వుతోనే ఎక్కువగా ఆకట్టుకున్న అందమైన హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడు మాత్రం తన గ్లామరస్ అందాలతో మతిపోయేలా చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో అతి తక్కువ కాలంలోనే చాలా వేగంగా పాపులర్ అయింది. ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్స్ ఏ విధంగా అయితే ఘాటైన అందాలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారో మీరాజాస్మిన్ కూడా అంతకుమించి అనేలా అందాల ఆరబోతతో షాక్ ఇస్తుంది. రీసెంట్ గా మరోసారి ఎద అందాలతో మీరాజాస్మిన్ స్టన్ అయ్యేలా చేసింది.. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే.

మిగతా భాషల్లో కూడా..
మలయాళం హీరోయిన్ మీరాజాస్మిన్ సొంత భాషలో కంటే మిగతా భాషల్లో కూడా అప్పట్లో మంచి గుర్తింపు అందుకుంది. 2001 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మీరాజాస్మిన్ వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు. అయితే ఆమె అందంతో మాత్రం పాతికేళ్ల హీరోయిన్ తరహాలోనే దర్శనమిస్తోంది. ఒక విధంగా ఆమె వయస్సు నాలుగు పదుల దాటింది అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.

ఆ సినిమా ద్వారా బిజీగా..
ఇక 2002లో రన్ అనే సినిమా ద్వారా మీరాజాస్మిన్ తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో కూడా ఆమెకు అప్పట్లో మంచి ఆఫర్లు వచ్చాయి. ఒక ఏడాదిలో ఆమె మినిమం 5 సినిమాలతో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కు కూడా సరైన పోటీని ఇచ్చింది. ఇక 2004లో మీరాజాస్మిన్ అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో కూడా
అయితే మొదట్లో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా విజయాలు అయితే రాలేదు. పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా ఆమె రేంజ్ పెంచలేకపోయింది. ఇక 2005లో చేసిన భద్ర సినిమా మాత్రం మీరాజాస్మిన్ కు మంచి గుర్తింపును అందించింది. కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో మరింత బిజీగా మారిపోయింది.

గ్లామర్ డోస్ పెంచకుండా
ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఏ సినిమాలోను పెద్దగా అందాల ఆరబోతతో అయితే కనిపించింది లేదు. గ్లామర్ డోస్ పెంచకుండా వీలైనంతవరకు సాంప్రదాయమైన హోమ్లీ క్యారెక్టర్లలోనే కనిపించేందుకు ప్రయత్నం చేసింది. ఇక ఆమె నటనకు పలు అవార్డులు కూడా దక్కాయి. ముఖ్యంగా మలయాళంలో అయితే ప్రతి ఏడాది నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

మరోసారి ఘాటైన లుక్
అయితే ఇప్పుడు మాత్రం మీరాజాస్మిన్ ఊహించని విధంగా తన గ్లామర్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తోంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ మీరాజాస్మిన్ ఇప్పుడు మలయాళం లోనే సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ను కొనసాగిస్తోంది. అయితే అప్పుడప్పుడు ఊహించని రేంజ్ లో అయితే ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆశ్చర్య పరుస్తుంది. రీసెంట్ గానే మీరా గ్లామరస్ అందాలతో మరోసారి మరింత ఘాటుగా కనిపించింది. మరి ఈ ఫోటో షూట్ ద్వారా మీరాజాస్మిన్ రాబోయే రోజుల్లో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











