Meera Jasmine ఎద అందాలతో రెచ్చిపోయిన బ్యూటీ.. సెకండ్ ఇన్సింగ్‌లో ఇంత హాట్‌గానా?

దక్షిణాది చిత్రసీమలో అగ్ర నటులతో కలిసి నటించిన కొద్ది మంది హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. అయితే టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో సినిమా పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో అభిమానులకు షాక్ గురయ్యారు. అయితే మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు సినిమాల్లో పుష్కలంగా ఆఫర్లు ఉన్న సమయంలోనే మీరా జాస్మిన్ పెళ్లి చేసుకొని ఇండియా వదిలి వెళ్లారు. ప్రస్తుతం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మీరా జాస్మిన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. మీరా జాస్మిన్ అందాల ఘుమ ఘుమలు మీరే చూడండి.,,

16 ఏళ్ల వయసులోనే సినిమా ఆఫర్

16 ఏళ్ల వయసులోనే సినిమా ఆఫర్


కేరళలో పుట్టి పెరిగిన మీరా జాస్మిన్ డిగ్రీ చదివేందుకు సిద్దమవుతుండగానే.. సూత్రధారణ్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సూత్రధారణ్ అనే చిత్రంలో నటించిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకొనే పరిస్థితి రాలేదు. అప్పటి నుంచి బహు భాషా హీరోయిన్‌గా టాప్ హీరోలందరితోను నటించి మెప్పించింది. తొలి చిత్ర ఆఫర్‌ను ఇచ్చిన లోహితాదాస్‌ను తన గురువుగా భావిస్తుంటానని అని మీరా జాస్మిన్ వెల్లడిస్తూ ఉంటారు.

కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని

కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని

తమిళ, మలయాళ భాషల్లో భారీ ఆఫర్లు తలుపు తట్టే క్రమంలోనే మీరా జాస్మిన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేసే అనిల్ జాన్ టైటస్‌ను ఫిబ్రవరి 9, 2014లో వివాహం చేసుకొని దుబాయ్ వెళ్లిపోయారు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఏడాదికి ఓ సారి సినిమాల్లో నటిస్తూ కనిపిస్తూ వస్తున్నారు.

పవన్ కల్యాణ్, బాలకృష్ణలతో కలిసి

పవన్ కల్యాణ్, బాలకృష్ణలతో కలిసి

తెలుగులో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రవితేజ లాంటి అగ్రహీరోల పక్కన నటించింది. అమ్మాయి బాగుంది అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మీరా జాస్మిన్.. ఆ తర్వాత గుడంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, గోరింటాకు, బంగారు బాబు, మా ఆయన చంటిపిల్లాడు చిత్రాల్లో నటించింది.

మలయాళ చిత్ర పరిశ్రమ వేటు

మలయాళ చిత్ర పరిశ్రమ వేటు

మీరా జాస్మిన్ సినీ జీవితం పలు వివాదాలు ఉన్నాయి. ట్వెంటీ20 అనే చిత్రంలో నటించడానికి నిరాకరించడంపై మలయాళ నిర్మాతల సంఘం ఆమెపై నిషేధం విధించింది. అసోసియేషన్ ఆఫ్ మలయాల మూవీ ఆర్టిస్ట్ నిషేధం విధించినా సినిమా షూటింగులకు హాజరు కావడం మరో వివాదంగా మారింది. నటుడు దిలీప్‌తో జరిగిన గొడవ పట్టించుకోకుండా సినీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లింది. అయితే నిషేధం గురించి నాకు తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

హిందువుల ఆలయంలోకి వెళ్లి..

హిందువుల ఆలయంలోకి వెళ్లి..

2006లో మీరా జాస్మిన్ మరో వివాదంలో చిక్కుకొన్నారు. కేరళలోని రాజరాజశ్వేర ఆలయంలో నియమాలకు విరుద్దంగా పూజలు చేయడంతో హిందూ మతతత్వ సంస్థలు భగ్గుమన్నాయి. హిందువులు కాకుండా ఆలయం ప్రవేశం చేయడం తప్పు అంటూ భక్తులు నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆలయాన్ని శుద్ది చేయడానికి మీరా జాస్మిన్ 10 వేల రూపాయలు చెల్లించి ఆ వివాదానికి స్వస్తి చెప్పారు.

మీరా జాస్మిన్ హాట్ హాట్‌గా

2014లో పెళ్లి తర్వాత మళ్లీ సినిమా కెరీర్‌పై మీరా జాస్మిన్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలతో అల్లాడిస్తున్నారు. ఇటీవల ఎద అందాలను ప్రదర్శిస్తూ పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 35 ఏళ్ల వయసులో కూడా గ్లామర్‌తో యువ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్న ఈ అందాల భామ తొడ అందాలను ప్రదర్శించడానికి వెనుకాడటం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ అందాల ఆరబోత హాట్ టాపిక్‌గా మారింది.

మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్

మీరా జాస్మిన్ కెరీర్ విషయానికి వస్తే.. పెద్దగా జోష్ కనిపించడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు పూమరమ్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం మాకాల్ సినిమాలో నటిస్తున్నది. అగ్ర హీరోల సరసన, భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు. సెకండ్ ఇన్సింగ్స్‌లో మళ్లీ గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X