ఎక్స్‌పోజింగ్‌లో గీత దాటిన మీరా జాస్మిన్: ఈ వయసులో కూడా ఇంత హాట్‌గానా!
ఈ రెండు దశాబ్దాల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది భామలు హీరోయిన్లుగా తెగ హడావిడి చేసేశారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో స్టార్లుగా హవాను చూపించారు. వారిలో మీరా జాస్మిన్ ఒకరు. సాదాసీదాగానే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంది. అయితే, ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకున్నా.. మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!
సౌత్‌లో హల్చల్ చేసింది: మలయాళీ అయిన మీరా జాస్మిన్ చిన్న వయసులోనే 'సూత్రధారన్' అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత అదే భాషలో చాలా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'రన్' అనే మూవీతో తమిళంలోకి, 'మౌర్య' అనే చిత్రంతో కన్నడంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. అదే సమయంలో 'అమ్మాయి బాగుంది' మూవీతో తెలుగులోకి ఎంటరైంది.

వరుస ఆఫర్లు.. దూరంగా: దక్షిణాదిలోని అన్ని భాషల్లో సందడి చేసిన మీరా జాస్మిన్‌కు తెలుగులో భారీ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే పవన్‌తో 'గుడుంబా శంకర్', రవితేజతో 'భద్ర', బాలయ్యతో 'మహారధి' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, ఇందులో కొన్ని చిత్రాలు మాత్రమే హిట్లను అందుకున్నాయి. దీంతో 2013లో వచ్చిన 'మోక్ష' మూవీ తర్వాత మీరా టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసింది.

పర్సనల్‌గా ఫెయిల్యూర్: రెండు దశాబ్దాలకు పైగానే మీరా జాస్మిన్ సౌత్ ఇండియా మొత్తంలో హవాను చూపించి సత్తా చాటింది. అయితే, పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. దీనికి కారణం పెళ్లి విషయంలో ఆమెకు బ్రేకప్ అయిపోయింది. ఇక, 2014 మీరా దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను మీరా వివాహం చేసుకుంది. ఇప్పుడు అతడితో కలిసి ఉండట్లేదని తెలిసింది.

విమానంతో తెలుగులోకి: పెళ్లైన తర్వాత కూడా మీరా జాస్మిన్ సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, 2018 తర్వాత అసలు ఒక్క సినిమాలోనూ ఆమె నటించలేదు. అయితే, ఏజ్ పెరుగుతోన్నా ఆమెకు మాత్రం ఇప్పటికీ ఆఫర్లు దక్కుతూనే ఉన్నాయి. ఇలా గత సంవత్సరం మలయాళంలో 'మక్కల్' అనే సినిమాలో నటించింది. ఇప్పుడు 'విమానం' మూవీలో నటించింది. ఇది తెలుగులోనూ రాబోతుంది.
అందులో యమా బిజీగా: అందానికి అందం, నటనకు నటనతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న మీరా జాస్మిన్ పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా ఇప్పటికీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

ఇప్పుడు కూడా హాట్ షో: మీరా జాస్మిన్ ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో తనదైన రీతిలో అలరిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా ఎద అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో మీరా ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తోంది.

మీరా హాట్ పిక్స్ వైరల్: హీరోయిన్‌గా ప్రయాణంలో సంప్రదాయమైన పాత్రలను మాత్రమే చేసిన మీరా జాస్మిన్.. సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె క్యాజువల్ టాప్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో మీరా ఎద అందాలు యమ కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్ బాగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











