పగలంతా కూతురిలా.. రాత్రి అలా.. డైరెక్టర్ డార్క్ సీక్రెట్ హీరోయిన్ లీక్!

సినిమా పరిశ్రమలో హీరోయిన్లపై దర్శక, నిర్మాతలు, సినీ ప్రముఖుల వేధింపుల వ్యవహారం బయటకు రావడం కొత్తేమీ కాదు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల దాష్టికాలను అందమైన అమ్మాయిలు బయటపెట్టి సంచలనం రేపడం తెలిసిందే. అయితే కొన్నిసార్లు అవి సంచలనాలుగానే మిగిలిపోగా, మరికొన్ని సార్లు ఇండస్ట్రీలో ఆయా సినీ ప్రముఖుల బిహేవియర్ గురించి తీవ్రమైన చర్యలు తీసుకొన్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఇటీవల పాకిస్థానీ నటి మీరా బాలీవుడ్ ప్రముఖుడు మహేష్ భట్‌పై తీవ్రమైన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మహేష్ భట్‌పై మీరా చేసిన కామెంట్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్‌కు చెందిన మీరాను నజర్ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు దర్శకుడు మహేష్ భట్ పరిచయం చేశాడు. ఆ సినిమా హిట్ కావడంతో ఆమె జాతకం మారిపోయిందనే మాట అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత మహేష్ భట్ నా గురువు, నా మెంటర్ అంటూ కామెంట్ చేసింది. ఆయన కూడా మీరాను తన కూతురు అంటూ ప్రేమను పంచాడు. అలాంటి వ్యక్తిని ఓ సందర్భంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.

Pakistani Actress Meera

మహేష్ భట్‌ గురించి డార్క్ సీక్రెట్‌ను బయటపెట్టిన మీరా.. తనను శారీరకంగా, మానసికంగా వేధించాడు. నన్ను పలు మార్లు చెంప దెబ్బలు కొట్టాడు. సుభాష్ ఘాయ్, మణిరత్నం లాంటి దర్శకుల వద్దకు వెళ్లి ఆఫర్లు అడుగుతానని అంటే నన్ను శారీరకంగా హింసించాడు. నన్ను పూర్తిగా వశ పరుచుకొని, తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూశాడని విమర్శలు చేసింది.

నా కెరీర్‌ను కుట్ర చేసి తుంగలో తొక్కాడు. నన్ను దేశం విడిచి పాకిస్థాన్‌కు వెళ్లమని ఆయన బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో నేను డిప్రెషన్‌కు గురయ్యాను. దాంతో బాలీవుడ్‌ను విడిచి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాను. ఆ తర్వాత మానసిక క్షోభను చాలా రోజులు అనుభవించాను అని మీరా చెప్పింది.

మహేష్ భట్ నన్ను దారుణంగా హింసించాడు. పగలు కూతురిలా చూసే వాడు. రాత్రి అలా ప్రవర్తించే వాడు. ఆయనలో మరో కోణం ఉంది. ఆయన చేసిన కుట్ర వల్లే నేను బాలీవుడ్ వదిలి దేశం విడిచిపోయాను అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత తాను చేసిన విమర్శలు, ఆరోపణలకు నిజం కాదు. నేను ఆయనపై జోక్ చేశాను అంటూ ముఖేష్ భట్ ఆఫీస్‌కు వెళ్లి క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మహేష్ భట్ ఆమెను దగ్గరికి రానివ్వలేదు అని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

ఇదిలా ఉండగా, తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఆమె నాపై లేని పోని విమర్శలు చేసింది. ఆమె మెంటల్ కండీషన్ బాగాలేదు. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోను అని మహేష్ భట్ ఆ వివాదాన్ని అంతటితో ముగించేలా చేశాడు. ఈ ఆరోపణలు, ఈ వివాదం 2009, 2011 సంవత్సరంలో జరిగాయి.

More from Filmibeat

Read more about: meera mahesh bhatt nazar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X