‘మూడుసార్లు విడాకులు.. అలాంటి తప్పిదాలు జరిగాయి.. కానీ డైవోర్స్ తర్వాతే హ్యాపీగా ఉన్నా’

దక్షిణాదిలో మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించి మెప్పించిన మీరా వాసుదేవన్ తన వైవాహిక జీవితంలో జరిగిన సంఘటనలను, తాను చేసిన తప్పిదాలను నిజాయితీగా తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. దాంపత్య జీవితంలో ఎదురైన సంఘటనలను ఆమె మీడియాతో నిర్భయంగా పంచుకొన్నారు. తన లైఫ్‌లో జరిగిన సంఘటనలు దాచాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమలో నటించడం ద్వారా కెరీర్ ప్రారంభించిన మీరా వాసుదేవన్ మ్యారేజ్ లైఫ్‌లో చోటు చేసుకొన్న మూడు డైవోర్స్ గురించి ఏం చెప్పారంటే?

తమిళ కుటుంబ నేపథ్యం ఉన్న మీరా వాసుదేవన్ ముంబైలో జన్మించారు. సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్న తర్వాత మోడలింగ్ రంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత అవకాశాలు రావడంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2003 సంవత్సరంలో జేడీ చక్రవర్తి హీరోగా నటించిన గోల్‌మాల్ అనే సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయయారు. ఆ తర్వాత అంజలి ఐలవ్ యూ అనే సినిమాలో కూడా నటించారు. అయితే మలయాళంలో అవకాశాలు రావడంతో పూర్తిగా మాలీవుడ్‌కే పరిమితయయ్యారు. ఎక్కువగా మలయాళ చిత్రాల్లోనే నటించారు.

Actress Meera Vasudevan

మీరా వాసుదేవన్ దాంపత్య జీవితానికి వస్తే.. తొలి వివాహం 2005 సంవత్సరంలో సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌తో జరిగింది. వారిద్దరి జీవితం ఐదేళ్లపాటు సవ్యంగా సాగింది. దాంపత్య జీవితంలో కలతలు, విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో వారిద్దరి 2010 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత 2011 సంవత్సరంలో మలయాలళం నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహం చేసుకొన్నారు. రెండో పెళ్లి ద్వారా ఓ కుమారుడు జన్మించాడు. నాలుగేళ్ల తర్వాత అంటే 2016 సంవత్సరంలో వారిద్దరు విడాకులు తీసుకొన్నారు. రెండుసార్లు వైవాహిక జీవితం దారుణంగా విచ్చిన్నమైన తర్వాత మూడోసారి వివాహానికి ప్రయత్నించారు. సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియాంకమ్‌ను 2024 సంవత్సరంలో పెళ్లి చేసుకొన్నారు. కానీ అదీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఏడాది తర్వాత ఎవరి దారి వారు చూసుకోవడంతో మూడోసారి విడాకులు తీసుకొన్నారు.

ఇటీవల మలయాళ మీడియాకు చెందిన మూవీ వరల్డ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా వాసుదేవన్ మాట్లాడుతూ.. నా దాంపత్య జీవితం మూడు సార్లు విచ్చిన్నం అయింది. మూడు సార్లు డైవోర్స్ తీసుకొన్నాను. నా లైఫ్‌లో జరిగిన సంఘటనలను మనస్పూర్తిగా అంగీకరించాను. నేను కొన్ని తప్పులు చేశాను. వాటిని దాచాలని ఏనాడు ప్రయత్నించలేదు. ఏం జరిగినా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకొన్నాను. ప్రస్తుతం నేను నా కెరీర్‌తో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను. నా లైఫ్‌లో అందమైన ప్రయాణం కొనసాగుతున్నది అని అన్నారు.

ఎవరి జీవితంలోనైనా అసంతృప్తి ఉంటే ఎదుటి వాళ్ల తీరును బేరీజు వేయడం మొదలుపెడుతారు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోతాయి. ఒకరికొకరు హర్ట్ అవుతారు. కానీ అనుభవాలు జీవించడం ఎలా అనేవి నేర్పుతాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో నేను నా తండ్రి, తల్లి, నా కొడుకు సలహాలను తీసుకొంటాను. నా కొడుకు చాలా మెచ్యురిటీతో ఉంటాడు. నాకు ఏదైనా పరిస్థితి ప్రతికూలంగా ఉంటే.. మంచి సలహాలు ఇస్తాడు అని మీరా వాసుదేవన్ తెలిపారు.

మీరా వాసుదేవన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో మలయాళ సినిమా రంగంలో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం అం అ:, గెట్ సెట్ బేబీ, యూనైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. తాజా ఇంటర్వ్యూతో ఆమె వైవాహిక జీవితం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X