బీచ్‌లో భర్తతో అలా .. వాలంటైన్స్ డే నాడు రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్
వాలంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేయసి ప్రియులతో గడిపారు లవర్స్. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఇందుకు అతీతం కాదు. స్పెషల్ డేట్ ప్లాన్ చేసుకుని కొందరు ఇండియాలో, మరికొందరు ఫారిన్‌లో లవర్స్ డేను సెలబ్రెట్ చేసుకున్నారు. కొత్తగా ప్రేమలో పడిన వారు తమ మనసులోని మాటను బయటపెట్టి ..జీవితాంతం గుర్తుండేలా ప్రపోజ్ చేసుకున్నారు. నటీనటులు తమ వాలంటైన్స్ డే సెలబ్రేషన్ తాలుకా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే హీరోయిన్ మేఘా ఆకాష్ తన భర్తతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ పాత వీడియోను షేర్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
2017లో నితిన్ హీరోగా వచ్చిన లై చిత్రంతో తెలుగువారిని పలకరించింది కోలీవుడ్ భామ మేఘా ఆకాష్. ముద్దుగా, బొద్దుగా ఉండే ఈ భామ తొలి సినిమాతోనే కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.
ఆ వెంటనే చల్ మోహన రంగా, గుర్తుందా శీతాకాలం, రావణాసుర వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ హీరోగా వచ్చిన రావణాసురలో నెగిటివ్ క్యారెక్టర్ చేసి భయపెట్టింది. అందం , అభినయం ఉన్నా మేఘా ఆకాష్‌కు ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు.

చివరిసారిగా తెలుగులో మను చరిత్రలో నటించింది మేఘా. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ (తెలుగు)తో మరోసారి తెలుగు వారిని పలకరించింది . మేఘా ఆకాష్ ప్రేమ, పెళ్లిపై గతంలో ఎన్నో రూమర్స్ హల్‌చల్ చేశాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే ఓ రోజున ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్ధం చేసుకుని షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ. సాయి విష్ణు తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు.
దాదాపు ఏడేళ్లుగా మేఘా - సాయి ప్రేమలో ఉన్నారట.. కానీ ఇన్నేళ్లలో ఎక్కడా ఆమె ఈ విషయం బయటికి చెప్పకుండా గుట్టుగా ప్రేమాయణం సాగించింది. కేరళలోని ఓ ఫేమస్ స్పాట్‌లో ప్రియుడి చేతికి ఉంగరాలు తొడిగింది మేఘా ఆకాష్. ఎంగేజ్‌మెంట్ తర్వాత కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులను వీరు స్వయంగా తమ పెళ్లికి ఆహ్వానించారు. అలాగే తన ఫ్రెండ్స్‌కి శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది మేఘా.
అనంతరం గతేడాది సెప్టెంబర్ 15న చెన్నైలో మేఘా ఆకాష్ - సాయి విష్ణుల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మేఘా ఆకాష్ .. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వాలంటైన్స్ డే సందర్భంగా ఫ్రాన్స్‌లో సాయి విష్ణుతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ నాటి వీడియోను షేర్ చేశారు. అందులో భర్తతో బీచ్ ఒడ్డున నిలబడి ఉన్నారు మేఘా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











