Mehreen: బీచ్‌లో బాయ్‌ఫ్రెండ్ కోసం మెహ్రీన్..అలా చిల్ అవుతూ గ్లామర్ ట్రీట్!
మెహరీన్ ఫిర్జాద గురించి టాలీవుడ్ మూవీ లవర్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. తాజాగా మిస్సింగ్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మరి ఆమె ఎవరిని మిస్ అవుతోంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది మెహరీన్ ఫిర్జాద. టాలీవుడ్ లో ఇప్పటి దాకా కృష్ణగాడి వీర ప్రేమ గాధ, రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఎఫ్ 2 అండ్ ఎఫ్ 3 వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది ఈ బ్యూటీ.

అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాను, ఇక సినిమాలకు గుడ్ బై అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి రద్దయింది. కానీ గతంలో ఉన్న ఫేమ్ మాత్రం తిరిగి రాలేదు. అలాగే అవకాశాలు కూడా కరువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది.
తాజాగా 28 ఏళ్ల ఈ మిల్కీ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో ఆకుపచ్చ రంగు ఉన్న బికినీ ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. బెలీజ్ లోని బీచ్ లో మెహరీన్ తన మెరిసే కాళ్ళను ప్రదర్శిస్తూ మరింత హాట్ గా ఫీల్ అయ్యేలా చేసింది. బికినీ ధరించినప్పటికీ నడుము చుట్టూ ఒక క్లాత్ ను కట్టుకుని బీచ్ లో చిల్ అవుతూ సూర్యస్తమయం అవుతున్న సమయంలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
అందులో ఆమె మినిమల్ మేకప్ తో పాటు చేతికి బ్రాస్లెట్, చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకొని స్పెషల్ గా కనిపించింది. ఇక ఈ ఫోటోలకు మిస్సింగ్ బెలిజియన్ అంటూ క్యాప్షన్ రాసింది. రిహన్న రాసిన సమ్ వేర్ ఓన్లీ వి నో అనే పాటను ఈ ఫోటోలకు జత చేసింది.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసి నెటిజెన్లు కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు. ఇక మెహరీన్ సినిమాల విషయానికి వస్తే ఆమె చివరిసారిగా స్పార్క్ అనే సినిమాలో నటించింది. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మెహరీన్ కు ఆఫర్లు ఏమీ రాలేదు.


Click it and Unblock the Notifications











