పెళ్లి కాకుండానే సంతానం కోసం మెహ్రీన్ ఫిర్జాదా.. ఏం చేసిందో మీరే చూడండి!
తెలుగు సినీ నటి మెహ్రీన్ పిర్జాదా గురించి టాలీవుడ్ ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా అసలు విషయాన్ని బయట పెట్టింది. మరి మెహరీన్ ఈ ప్రాసెస్‌ను ఎందుకు ఫాలో అవుతుందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న మెహరీన్ ప్రస్తుతం పర్సనల్ లైఫ్ విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తోంది.

పెళ్లి పనుల హడావిడి నడుస్తుండగానే కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెళ్లి వాయిదా పడిందని, పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా చేసుకుంటానని వెల్లడించింది. ఇక ఆ గ్యాప్ లోనే సినిమాలకు సైన్ చేయడానికి రెడీ అయింది. కానీ ఆ తర్వాత సడన్ గా భవ్య బిష్ణోయ్‌తో తన వివాహం రద్దు చేసుకున్నాను అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఇక అప్పటినుంచి ఆమె సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ కెరీర్ ఒడిదుడుకులతోనే సాగుతోంది. తాజాగా ఆమె పెళ్లి కాకుండానే పిల్లల్ని విషయంలో ప్లానింగ్ మొదలు పెట్టింది. ఇటీవల కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్ బాగా ట్రెండ్ అవుతుంది. దాన్నే ఫాలో అవుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది మెహరీన్.
ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కానీ 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాలని భద్రపరచుకొని, కావలసినప్పుడు పిల్లలికనే ప్రాసెస్ ఎగ్ ఫ్రీజింగ్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు.
తాజాగా అలా చేసుకుంటున్న సెలబ్రిటీల లిస్టులో మెహరీన్ చేరింది. గత రెండు నెలల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందంటూ వెల్లడించింది. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని, తల్లి కావడం అనేది తన కల అని చెప్పుకొచ్చింది. అయితే పిల్లల్ని కనడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ను ఫాలో అవుతున్నాను అని వెల్లడించింది. ప్రస్తుతం మెహరీన్ షేర్ చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











