Aisha Sharma: డ్రెస్ ఉన్నా లేనట్లే.. అక్క కంటే హద్దులు దాటేస్తున్న ఐషా.. ఇంకా ఎంత చూపిస్తుందో?
ఓకే ఫ్యామిలీ నుంచి వచ్చిన నటీనటులు సినిమా ఇండస్ట్రీలో వారికంట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంటూ వస్తున్నారు. ఇంకా హీరోయిన్స్ లలో కూడా కొంతమంది సోదరీమణులు కూడా బాగానే క్రేజ్ అందుకుంటున్నారు. ఇక శర్మా సిస్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఐషా శర్మ అయితే తన సోదరికంటే ఎక్కువ స్థాయిలో గ్లామర్ ట్రీట్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల కాలంలో అయితే ఈ బ్యూటీ మరింత హద్దులు దాటేసినట్లు కనిపిస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫోటో వివరాలలోకి వెళితే..

ఆ హీరోయిన్ సోదరి
ఐషా శర్మ.. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బిజీగా ఉంటే నెటిజన్స్ కు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నేహా శర్మ ఏకైక సోదరి ఐషా శర్మ. అతి తక్కువ కాలంలోనే మోడల్ గా మంచి గుర్తింపును అందుకుంది. ఇక తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా నిలదొక్కుకోవాలి అని ఈ బ్యూటీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

బాలీవుడ్ సినిమాతో డెబ్యూ
ఐషా శర్మ 2018 లో సత్యమేవ జయతే అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అంతకంటే ముందే తెలుగులో కూడా కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ బాలీవుడ్ సినిమా తోనే పరిచయం అవ్వాలి అని బాగానే ప్రయత్నాలు చేసి మొత్తానికి ఆ సినిమాలో అయితే అవకాశం అందుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు.

అక్కతో కూడా ఫొటో షూట్స్
ఐషా శర్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం ఒకే ఒక సినిమా చేసినప్పటికీ కూడా ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే నిరంతరం గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. చాలాసార్లు బికినీలో కూడా తన సోదరితో కలిసి ఫోటోలకు స్టిల్ అయితే ఇచ్చింది. ఎన్నిసార్లు గ్లామర్ డోస్ పెంచినా కూడా అదే రేంజ్ లో క్రేజ్ అందుతూ ఉండడం విశేషం.

వెబ్ సీరీస్ లలో కూడా అవకాశాలు
ఇక సినిమాల్లో అవకాశాలు రావడం లేదు అని ఐషా శర్మ వెబ్ సిరీస్లలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే గత ఏడాది చేసిన ఒక వెబ్ సిరీస్ అయితే అంతగా సక్సెస్ కాలేదు. దీంతో మళ్లీ మరొక వెబ్ సిరీస్ చేయడానికి కూడా ఈ బ్యూటీ ఒప్పుకుంది. ఇక అప్పుడప్పుడు పలు టెలివిజన్ రియాలిటీ షోలలో కూడా మెరిసే ప్రయత్నం చేస్తోంది. తన డాన్స్ స్కిల్స్ తో కూడా ఆకట్టుకుంటుంది.

డ్రెస్ ఉన్నా లేనట్లే..
ఇక ఆయేషా శర్మ గ్లామర్ ట్రీట్ అందించడంలో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తుంది అనే చెప్పాలి. ఈ బ్యూటీ ఇటీవల బ్లాక్ డ్రెస్ లో తన లెగ్స్ అందాలను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. ఒక విధంగా డ్రెస్ ఉన్నా లేనట్లే అనే విధంగా ఆమె చాలా వయ్యారంగా దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

బౌన్స్ బ్యాక్ అవ్వాలని..
ఐషా శర్మా ఎలాంటి ఫోటోకు స్టిల్ ఇచ్చిన కూడా అందులో గ్లామర్ డోస్ మాత్రం హై లెవెల్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతమైతే ఖాళీగానే ఉంది. అప్పుడప్పుడు కొన్ని మ్యూజిక్ వీడియోస్ లో కూడా కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇక మళ్లీ మంచి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా ఆమె సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆమెకు ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











