‘ఆ డైరెక్టర్ నా బట్టలు విప్పించి ... భర్త కజిన్ నాపై దారుణంగా’
చిత్ర పరిశ్రమలో స్టార్లుగా ఎదుగుతున్న వారు నిజ జీవితంలో ఎన్నో విషాదాలను, అవమానాలను ఎదుర్కొంటారు. కానీ కెమెరా ముందుకు వచ్చేసరికి ఈ బాధను పంటి బిగువున భరించి వినోదాన్ని అందిస్తుంటారు నటీనటులు. ఇక కెరీర్‌లో ఓ వెలుగు వెలిగి అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు సీనియర్ నటి మోహిని. ఒకప్పుడు తన అంద చందాలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
మోహని అసలు పేరు మహాలక్ష్మీ శ్రీనివాసన్. తొలుత బాలనటిగా తమిళంలో కొన్ని సినిమాలు చేశారు. అయితే చాలా చిన్న వయసులోనే ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు మోహని. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. గ్లామరస్ రోల్స్‌తో పాటు నటన ప్రధానంగా సాగే సినిమాలతో ఆమె సత్తా చాటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్‌లో ఆయనకు చెల్లెలిగా నటించారు మోహిని. ఇదే ఆమెకు తెలుగులో చివరి సినిమా.

హీరోయిన్‌గా క్షణం తీరిక లేకుండా ఉన్న దశలోనే భరత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న మోహిని అనంతరం భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే మనస్పర్ధలు రావడంతో మోహిని - భరత్‌లు కొన్నేళ్లుగా విడాకులు తీసుకున్నారు. ఈ దశలో హిందూ మతం నుంచి క్రైస్తవ మతం స్వీకరించిన మోహిని.. మత ప్రచారకురాలిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత అవకాశాల కోసం ప్రయత్నించారు మోహిని. అయితే అప్పటికే పెళ్లయిపోవడం, కొత్త అమ్మాయిలు రావడం తదితర కారణాలతో మోహినికి అవకాశాల దక్కలేదు. ఒకటి రెండు సినిమాలలో మోహిని నటించారు. 2011లో మలయాళంలో సురేష్ గోపీ హీరోగా వచ్చిన కలెక్టర్ అనే సినిమాలో చివరిసారిగా కనిపించారు.
కొద్దినెలల క్రితం ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో తన కెరీర్, వైవాహిక జీవితం, ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహిని. ఓ తమిళ సినిమాలో పాట కోసం దర్శకుడు స్విమ్మింగ్ పూల్‌లో ప్లాన్ చేశారు. అయితే నాకు ఈత రాదు.. ఇప్పటిలా స్విమ్మింగ్ నేర్పించడానికి లేడీ ఎక్స్‌పర్ట్స్ ఉండేవాళ్లు కాదు. అందరూ మగవాళ్లే. వాళ్ల ముందు స్విమ్ సూట్ వేసుకుని స్విమ్మింగ్ చేయడానికి, నటించడానికి చాలా ఇబ్బందిపడ్డా. దాంతో ఈ సీన్ చేయనని దర్శకుడితో తేల్చిచెప్పేశా.. కానీ అతను మాత్రం నాతో బలవంతంగా స్విమ్ సూట్ వేయించి స్విమ్మిగ్ పూల్ సీన్ తీశాడు. ఎంతో కష్టపడి, ఏడుస్తూనే ఆ సీన్ చేశా.. అక్కడితో అయిపోయిందని అనుకుంటే తిరిగి ఊటీలో అచ్చం అదే తరహా సీన్ చేయాలని దర్శకుడు ఒత్తిడి చేయడంతో నా వల్ల కాదని ముఖం మీద చెప్పేశా.
రీ ఎంట్రీలో పలు సినిమా ఆఫర్లు వచ్చాయి. హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీలో సిమ్రన్ పాత్ర తొలుత నా దగ్గరికే వచ్చింది. అంతకుముందు రజనీ సర్ నటించిన ముత్తులో హీరోయిన్‌గానూ నాకే ఆఫర్ వచ్చింది. ఆ సినిమాను కూడా వదులుకున్నా. పని కోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకు ఇష్టం ఉండదు. రాసిపెట్టి ఉంటే మనకే వస్తుందని నమ్ముతా. కొందరు వ్యక్తులు నా సక్సెస్ చూసి ఓర్వలేక నేను నాశనమైపోవాలని చేతబడి చేయించారని మోహిని తెలిపారు. నా భర్త కజినే ఇలా చేయించారని తెలిసింది. జీవితంలో ఎన్నో కష్టాలను తట్టుకుని నిలబడ్డా.. వీటి నుంచి ఆ దేవుడే నన్ను కాపాడాడని మోహిని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications