twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోనాల్ గజ్జర్ హాట్ సెల్ఫీ: అద్దంలో ఆ అందాలు కనిపించడంతో!

    |

    టాలీవుడ్‌లోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయమైనా.. అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా మారారు. మిగిలిన వారిలో ఎందరో సరైన అవకాశాలను అందుకోలేక సినిమాలకు దూరం అయిపోయారు. అందులో గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ ఒకరు. చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. కొన్ని సినిమాలను మాత్రమే చేసి మాయమైంది. బిగ్ బాస్ షో పుణ్యమా అని మళ్లీ ఎంటరైనా.. సరైన అవకాశాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో మరోసారి టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోనాల్ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దాన్ని మీరు కూడా చూసేయండి!

    అలా ఎంటర్.. గుర్తింపు రాలేదు

    అలా ఎంటర్.. గుర్తింపు రాలేదు

    చిన్న వయసులోనే మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే 'సుడిగాడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో మరో రెండు మూడు చిత్రాల్లో నటించినా ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును, ఆఫర్లను అందించలేదు. ఫలితంగా ఆమె టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, వేరే భాషల్లో మాత్రం వరుసగా మూవీలను చేస్తూ వచ్చింది.

    అతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోతఅతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోత

    బిగ్ బాస్ ఎంట్రీ.. లవ్ ట్రాక్‌తో

    బిగ్ బాస్ ఎంట్రీ.. లవ్ ట్రాక్‌తో

    టాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని పట్టేసింది. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయింది. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత ఫేమస్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ బ్యూటీ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది.

    బయటా రచ్చే... పెరిగిన గ్యాప్

    బయటా రచ్చే... పెరిగిన గ్యాప్

    బిగ్ బాస్‌ షోలో అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి గురించి తెలిసిందే, చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలిసి ఎంజాయ్ చేశారు. అయితే, కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య గ్యాప్ కనిపిస్తోంది.

    యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన: ఏకంగా అలాంటి ఫోజులతో ఘోరంగా!యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన: ఏకంగా అలాంటి ఫోజులతో ఘోరంగా!

    తెలుగులో ఇలా... అక్కడ బిజీ

    తెలుగులో ఇలా... అక్కడ బిజీ

    బిగ్ బాస్ షో వల్ల మోనాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్రేజ్ పెరిగింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపించిన 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో జడ్జ్‌గా చేసింది. అయితే, సరైన బ్రేక్ రాకపోవడంతో ఈ అమ్మడు వేరే భాషల్లో సినిమాలు చేస్తోంది.

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

    అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోన్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ తెగ హైలైట్ అయిపోతోంది.

    ఉల్లిపొర లాంటి చీరలో మంజూష రచ్చ: ఆ అందాలన్నీ చూపిస్తూ హాట్ షోఉల్లిపొర లాంటి చీరలో మంజూష రచ్చ: ఆ అందాలన్నీ చూపిస్తూ హాట్ షో

    అందాలను ఆరబోస్తూ రచ్చ

    అందాలను ఆరబోస్తూ రచ్చ


    మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక ఫొటోలను వదులుతూ ఉంటోంది. అందులో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్‌లతో పాటు వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చుతోంది. తద్వారా సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌కు మజాను పంచడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతోంది.

    మోనాల్ గజ్జర్ సెల్ఫీ వైరల్

    మోనాల్ గజ్జర్ సెల్ఫీ వైరల్

    మోనాల్ గజ్జర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె క్యాజువల్ టాప్ వేసుకుని అద్దం ముందర కూర్చుని ఫొటో తీసుకుంది. ఫలితంగా మోనాల్ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.

    English summary
    Tollywood Heroine, Bigg Boss Fame Monal Gajjar Full Busy After Reality Show. Now She Shared Hot Selfie in her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X