ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న నాగిని.. ఇటలీలో పెళ్లికి ఏర్పాట్లు
బాలీవుడ్‌లో సినీ తారల పెళ్లిళ్ల జోరు కనిపిస్తున్నది. ఇప్పటికే కత్రినా కైఫ్, వికీ కౌశల్ జంట వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా ఆ వార్తల జోష్ తగ్గకముందే మరో జంట పెళ్లికి సిద్దమవుతున్నది. బాలీవుడ్‌లో అందాల తారగా రాణిస్తున్న మౌనీ రాయ్ వివాహానికి సిద్దమవుతున్నది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ తార మౌనీ రాయ్ తన చిరకాల ప్రియుడు సూరజ్ పెళ్లి చేసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ఏడాదిలో ముంబైలో మందిరాబేడి ఇంటిలో సూరజ్‌ను మౌనీరాయ్ కలుసుకొన్నారు. అప్పుడు జరిగిన పరిచయం ప్రేమ వరకు వెళ్లింది. వాళ్లిద్దరు కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకొని ముంబైలో తిరుగుతున్నారు. సూరజ్‌తో అఫైర్ గురించి మౌనీరాయ్ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. మేమిద్దరు ప్రేమలో ఉన్నాం. ఐ లవ్ యూ అంటూ ఓ పోస్టును ఇటీవల మౌనీ రాయ్ పెట్టింది.
టెలివిజన్ రంగంలో క్యుంకీ సాస్ బీ బహు థీ, నాగిన్, దో సహేలీయాన్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత గోల్డ్, కేజీఎఫ్ 1, రోమియో అక్బర్ వాల్టర్ అనే చిత్రాల్లో నటించారు. మౌనీ రాయ్ తాజాగా జీ5 కోసం రూపొందించిన లండన్ కన్ఫిడెన్షియల్‌లో కనిపించింది. అలాగే పత్లీ కమారియా, బైతే బైతే, డిస్కో బల్మా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది.


Click it and Unblock the Notifications











