Body Shaming: నిన్న కాజల్ అగర్వాల్.. నేడు మృణాల్ థాకూర్.. బాడీ షేమింగ్‌పై నోర్మూయించిన హీరోయిన్లు

ఒక్కో హీరోయిన్‌లో ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఇలియానా నడుము, అనుష్క ఫిగర్, సమంత స్మైల్, తమన్నా మిల్కీ అందాలు ఇలా ఎవరి అందం వాళ్లది. తెరపై వీళ్లని చూసి తమకు కాబోయే భార్యలు ఇలాగే ఉండాలంటూ అబ్బాయిలు ఊహల్లో తేలిపోతుంటారు. హీరోయిన్స్ అంటేనే అందానికి బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి వాళ్లు.. కెరీర్ నాలుగు కాలాల పాటు నిలబడాలన్నా, అవకాశాలు రావాలన్నా ఆ అందాన్ని కాపాడుకోవాలి.

కొంచెం ఒళ్లు చేసినా ఇబ్బందే.. ఇష్టమైనవి వదులుకోవాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్లు బాడీ షేమింగ్‌ బారినపడుతున్నారు. అనుష్క శెట్టి, నిత్యమీనన్, పూనమ్ బజ్వా, నివేధా థామస్, ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్, నమిత, రక్షిత ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదే. సోషల్ మీడియాలో తమపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌పై కొందరు స్పందిస్తూ.. మా బాడీ, మా ఇష్టం, మీకెందుకు నొప్పి అంటూ ఓపెన్‌గానే మండిపడుతుంటారు. ఇంకొందరు మాత్రం పట్టించుకోకుండా తమ పని తాను చేసుకుంటూ పోతారు.

actress Mrunal Thakur and Kajal Aggarwal befitting reply on body-shame slams insensitive comments

మొన్నామధ్య కాజల్ అగర్వాల్ గర్భం దాల్చినప్పుడు.. ఆమె శరీరాకృతిపై నెటిజన్లు కామెంట్స్ చేయగా.. కాజల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. నా జీవితంలో, నా ఇంట్లో, నా పనిలో, నా శరీరంలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. మీరు బ్రతకండి.. ఇతరులనూ బ్రతకనీయండి, స్వార్ధంతో ఆలోచించే వ్యక్తులకు ఈ మాటలు ఎప్పటికీ అర్ధం కావంటూ కాజల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు మంచు లక్ష్మీ, సమంత, ప్రగతి తదితర నటీమణులు మద్ధతుగా నిలిచారు.

ఇక ముక్కుసూటితనానికి పెట్టింది పేరైన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరేమనుకున్నా సరే మనసులో ఉన్న మాటలను చెప్పడానికి వెనుకాడను అన్నట్లుగా ఉంటుంది మృణాల్. సీతారామంతో తెలుగువారిని పలకరించిన ఈ బ్యూటీ హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి ఏ కొత్త ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయనప్పటికీ.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది.

actress Mrunal Thakur and Kajal Aggarwal befitting reply on body-shame slams insensitive comments

గ్లామర్ ఇండస్ట్రీలో కొన్ని అంశాలపై మాట్లాడాలంటేనే చాలా మందికి బెరుకు. అలాంటి వాటిపై మొహమాటం లేకుండా ఓపెన్ అవుతారు మృణాల్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు బాడీ షేమింగ్‌, ముఖ్యంగా థైస్‌పై ప్రశ్న ఎదురవ్వగా.. దానికి ఘాటుగా బదులిచ్చారు మృణాల్ ఠాకూర్. తనకు థిక్ థైస్ ఉన్నాయని.. ఆ విషయంలో తనకు ఎలాంటి రిగ్రెట్ లేదని తేల్చిచెప్పింది.

తాను వర్కవుట్‌కి వెళ్లినప్పుడు కూడా కొందరు .. నీ థైస్ తగ్గడానికి వచ్చావా, అదేనా నీ సమస్య అంటూ కామెంట్స్ చేస్తుంటారని ఆమె పేర్కొన్నారు. నా థైస్‌తో తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని.. నాలాంటి థైస్ కావాలని ఎంతోమంది డబ్బులచ్చి మరీ వర్క్‌వుట్స్‌ చేస్తుంటారని, నా థైసే నా స్ట్రెంత్ అంటూ మృణాలు బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు బాడీ షేమింగ్‌ బారినపడిన హీరోయిన్లకు స్పూర్తిగా మారాయి.

More from Filmibeat

Read more about: mrunal thakur body shame
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X