ఆ హీరోతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మృణాల్.. అలా పట్టుకుని కనిపించడంతో!

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి చిత్రంతోనే సెన్సేషన్ అయిన హీరోయిన్లు అతి తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. అప్పుడెప్పుడో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తెలుగులోకి వచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, బాలీవుడ్‌లోనూ తెగ సందడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మృణాల్ ఠాకూర్.. హీరో సిద్దాంత్ చతుర్వేదితో డేటింగ్‌లో ఉందని తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

సీరియళ్ల నుంచి సినిమాల్లో
మోడలింగ్ రంగంలో తనదైన రీతిలో అలరించిన మృణాల్‌ ఠాకూర్‌.. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా నటిగా మారింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లతో అలరించింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేసి సత్తా చాటుకుంది.

Actress Mrunal Thakur and Siddhant Chaturvedi Dating News Goes Hot Topic

సీతగా మృణాల్ సెన్సేషన్
బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతా రామం'తో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది. దీంతో ఎంతో మంది దృష్టిలో పడింది.

నానితో హిట్.. ఇప్పుడిలా
'సీతా రామం' సక్సెస్‌తో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇలా ఇప్పటికే 'హాయ్ నాన్న'తో భారీ హిట్‌ను అందుకుంది. అయితే, ఇటీవలే వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ మాత్రం ఆమెకు పరాజయాన్నే మిగిల్చింది.

Actress Mrunal Thakur and Siddhant Chaturvedi Dating News Goes Hot Topic

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ
తెలుగులో హిట్లు కొడుతూ సత్తా చాటిన మృణాల్ ఠాకూర్‌కు ఇక్కడ చాలా అవకాశాలు వచ్చినా తనకు నచ్చిన వాటినే చేస్తోంది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మ 'Pooja Meri Jaan' అనే బాలీవుడ్ మూవీలోనే నటిస్తోంది. అలాగే, ప్రభాస్ కొత్త సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు, సిరీస్‌లకు ఆమె ఒప్పుకుంది.

హీరోతో దొరికిన హీరోయిన్
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న మృణాల్ ఠాకూర్.. గతంలో పలువురు హీరోలతో డేటింగ్ చేసినట్లు బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె గురించి ఏమీ ప్రచారం జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్ నటుడు సిద్దాంత్ చతుర్వేదితో డిన్నర్ డేట్‌కు వెళ్లి వస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.

Actress Mrunal Thakur and Siddhant Chaturvedi Dating News Goes Hot Topic

డేటింగ్ చేస్తున్నారంటూ
తాజాగా మృణాల్ ఠాకూర్.. సిద్దాంత్ చతుర్వేదితో కలిసి ఓ రెస్టారెంట్ ముందర కెమెరాలకు చిక్కింది. ఆ సమయంలో వీళ్లిద్దరూ హగ్ చేసుకోవడంతో పాటు కారు ఎక్కే వరకూ ఒకరు చేయి ఒకరు పట్టుకుని నడుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. అంతే.. మృణాల్, సిద్దాంత్ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X