ఆ హీరోతో లిప్ లాక్ చేయడంతో కెరీర్ నాశనం.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్
సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొనే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేమ్ అండ్ ఫేమ్ మాత్రమే కాదు , ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక త్యాగాలకు అంతే ఉండదు. ఇంత శ్రమించినా జీవితంలో సక్సెస్ కాలేక ఫేడ్ అవుట్ అయినవారు ఎందరో. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది హీరోయిన్ల క్యారెక్టర్‌పై చులకనగా మాట్లాడే వారెందరో. ఇక్కడ సక్సెస్ సాధించినా కాకుల్లా పొడిచే కొందరి కారణంగా హీరోయిన్లు మానసికంగా కృంగిపోతుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు మృణాల్ ఠాకూర్.
మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ 2012లో ముజ్‌సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్ అనే సీరియల్‌లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 2014లో విట్టి దండు అనే మరాఠీ చిత్రంతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టారు.. 2018లో లవ్ సోనియాలో నటించారు. తర్వాత తుఫాన్, ధమాక, జెర్సీ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అంతకుముందు కలర్స్ టీవీలో బాక్స్ క్రికెట్ లీగ్‌లో, డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే సీజన్ 7లోనూ మెరిశారు.

అందం, నటనలో తిరుగులేనప్పటికీ మృణాల్ ఠాకూర్ బ్రేక్ కోసం ఎంతగానో ఎదురుచూసింది. ఈ దశలో అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో వింటేజ్ లుక్, మెస్మరైజింగ్ యాక్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు మృణాల్. ఈ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
ఆ వెంటనే హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలలో అవకాశాలను అందుకున్నారు మృణాల్. టాలీవుడ్‌లో వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె ప్రస్తుతం సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, హేజవానీ తో ఇష్క్ చిత్రాల్లో నటిస్తున్నారు. స్వీట్‌గా, సాఫ్ట్‌గా కనిపిస్తున్నా.. మృణాల్‌లో దూకుడెక్కువ. మనసులో ఏమున్నా సరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడతారు.

ఇక 30 ప్లస్‌లో ఉండటంతో పెళ్లెప్పుడు అని ఎవరైనా అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తనను అర్ధం చేసుకునే వాడినే పెళ్లి చేసుకుంటానని.. పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉందంటూ మృణాల్ బాంబు పేల్చింది. అన్నింటికి మించి తనకు ప్రేమ మీద సదభిప్రాయం లేదని కుండబద్ధలు కొట్టింది. ఇకపోతే.. కెరీర్ తొలినాళ్లలో పలువురు హీరోలతో లిప్ లాక్ సీన్స్‌లో నటించడంతో మృణాల్ తల్లిదండ్రులు ఆమెను గట్టిగా మందలించారట. అలాగే ఇకపై అలాంటి సీన్స్‌లో నటించకూడదని కండీషన్స్ పెట్టడంతో ఎన్నో క్రేజీ సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని గ్రహించిన తాను తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి లిప్ లాక్ , రొమాంటిక్ సీన్స్‌లో నటించినట్లు తెలిపింది మృణాల్.


Click it and Unblock the Notifications











