Mrunal Thakur : తెగించిన అభిమాని .. ఆ ప్లేస్‌లో టచ్ చేస్తూ , ఇచ్చిపడేసిన మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియా సహా సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో సమాచార విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ నలుమూలలా ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఎన్నో ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు సోషల్ మీడియా ఊపిరి పోసింది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు.. టెక్నాలజీని మంచి వాడితే దాని నుంచి విలువైన ప్రయోజనాలను రాబట్టవచ్చు. కానీ దుర్వినియోగం అయితే మాత్రం ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. తాజాగా డీప్ ఫేక్ అనే భూతం ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తోంది.
సోషల్ మీడియా పుణ్యామా అని హీరోన్లు ట్రోలింగ్ బారినపడుతున్నారు. ఫలానా హీరోయిన్ , ఫలానా వ్యక్తితో తిరుగుతోందని.. రేపో మాపో పెళ్లి అంటూ నకిలీ వార్తలు వండి వారుస్తున్నారు. వీటికి తోడు ఎడిటింగ్, ఫోటో మార్ఫింగ్ వంటి టెక్నాలజీలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మొన్నామధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో హల్ చల్ చేసింది. ఓ అజ్ఞాత వ్యక్తి రష్మిక ముఖాన్ని ఎడిట్ చేసి.. న్యూడ్ డ్రెస్‌లో ఉన్న మరో అమ్మాయికి తగిలించాడు.

ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించడంతో పాటు పలువురు ప్రముఖులు , సెలబ్రెటీలు కూడా ఘాటుగా స్పందించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వం సైతం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మికను నియమించింది. కేంద్ర హోంశాఖ కింద ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పనిచేస్తోందని తాను దానికి బ్రాండ్ అంబాసిడర్‌ని అని ఆమె తెలిపారు.
ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటున్నా డీప్ వీడియో, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తర్వాత కొద్దిరోజులకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఫేక్ వీడియో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్లుగా ఉన్న సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలా హీరోయిన్లు, ఇతర ప్రముఖులను డీప్ వీడియోలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటననే ఎదుర్కొన్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.

దీపావళి పండుగను పురస్కరించుకుని సౌఖిన్ అనే అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పంచుకున్నాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాలోని మృణాల్ ఫోటోను ఎడిట్ చేశాడు. అందులో హీరో విజయ్ దేవరకొండ .. మృణాల్‌తో క్లోజ్‌గా ఉంటూ దీపావళి సందర్భంగా దివ్వెలు వెలిగించి, పటాకులు కాలుస్తుంటాడు. ఈ ఫోటోలో విజయ్ ఫేస్‌ను ఎడిట్ చేసిన సౌఖిన్ ఆ ప్లేస్‌లో తన ఫోటో పెట్టుకున్నాడు. ఇది కాస్త మృణాల్ దృష్టికి రావడంతో ఆమె మండిపడ్డారు. భయ్యా.. మీరు చేసిన పని ఏమైనా బాగుందని అనుకుంటున్నారా? ఇది అస్సలు కరెక్ట్ కాదు అంటూ కామెంట్ పెట్టారు. నెటిజన్లు కూడా అతనిపై చురకలు వేయడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











