1400 ఏళ్లనాటి ఆలయంలో మృణాల్ ఠాకూర్ వింత పూజలు.. ఎందుకు చేస్తున్నదో తెలుసా?

మనశ్శాంతి కోసమో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడో దేవుడి సన్నిధికి వెళ్లి మనిషి మొరపెట్టుకుంటాడు. ఇంకొందరు మాత్రం కనీసం నెలకొకసారైనా ఏదో ఒక ఆలయానికి వెళ్లాల్సిందే. సామాన్యులే కాదు, సెలబ్రెటీలకు ఇలాంటి నమ్మకాలు ఎక్కువ. ముహూర్తాలు , జ్యోతిష్యం, శకునాలు వంటి వాటిని పాటించే స్టార్స్ ఎందరో. మంచి శకునం లేకుంటే అడుగు కూడా బయటపెట్టని నటీనటులు చాలా మందే. తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఓ ప్రాచీన దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ 2012లో ముజ్‌సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్ అనే సీరియల్‌లో బాలనటిగా మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 2014లో విట్టి దండు అనే మరాఠీ చిత్రంతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టారు.. 2018లో లవ్ సోనియాలో నటించారు. తర్వాత తుఫాన్, ధమాక, జెర్సీ సినిమాల్లో తళ్లుక్కుమన్నారు. అంతకుముందు కలర్స్ టీవీలో బాక్స్ క్రికెట్ లీగ్‌లో, డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే సీజన్ 7లోనూ మెరిశారు.

actress mrunal thakur visits 1400 years old Jageshwar Temple complex in Uttarakhand here

అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ వెంటనే హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు చేశారు. టాలీవుడ్‌లో వచ్చిన ఫేమ్, నేమ్‌తో బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు మృణాల్. ప్రస్తుతం సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, హేజవానీ తో ఇష్క్ చిత్రాల్లో ఆమె నటిస్తూ స్టార్ రేసులో దూసుకెళ్తున్నారు.

గ్లామర్ ఇండస్ట్రీలో కొన్ని కాంట్రవర్సియల్ సబ్జెక్ట్స్‌పై మాట్లాడాలంటేనే చాలా మంది బయపడతారు. కానీ మృణాల్ దగ్గర అలాంటివేవి ఉండవు.. మనసులో ఏమున్నా సరే కుండబద్ధలు కొడతారు. మొన్నామధ్య తన థిక్ థైస్‌పై ట్రోలింగ్ జరగడంతో ఘాటుగా బదులిచ్చారు. నా థైస్‌ వల్ల తనకు ఏ సమస్యా లేదని.. నాలాంటి థైస్ కావాలని ఎంతోమంది డబ్బులచ్చి మరీ వర్క్‌వుట్స్‌ చేస్తుంటారని చెప్పారు. నా థైసే నా స్ట్రెంత్ అంటూ మృణాల్ చాలా బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు.

తనను అర్ధం చేసుకునే వాడినే పెళ్లి చేసుకుంటానని.. పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉందంటూ సీత బాంబు పేల్చింది. అలాగే తనకు ప్రేమ మీద సదభిప్రాయం లేదని కుండబద్ధలు కొట్టింది. తాజాగా ఉత్తరాఖండ్ అల్మోరా ప్రాంతంలోని దాదాపు 1400 ఏళ్ల నాటి జగేశ్వర్ ధామ్ ఆలయాన్ని మృణాల్ ఠాకూర్ సందర్శించారు. దాదాపు 200కు పైగా రాతి ఆలయాలు ఒకే కాంప్లెక్స్‌లో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

బ్లూ కలర్ టైట్ టీ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్‌ వేసి టోపీ పెట్టుకుని ఈ ఆలయంలో సందడి చేశారు మృణాల్. అలాగే ఈ క్షేత్రం మీదుగా పారుతున్న నదిలో రాళ్లను వరుసగా నిలబెట్టి కోరిక కోరితే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. దీంతో మృణాల్ కూడా నీటిలో రాళ్లను పేర్చి ఏదో కోరిక కోరుకున్నారు. తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలను మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X