చిక్కుల్లో హీరోయిన్.. అసభ్యకరంగా వేధిస్తుంది అంటూ ఫిర్యాదు.. కేసు నమోదు?
తెలుగు తమిళ భాషలలో అనేక సినిమాలలో నటించిన ముంతాజ్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగులో, తమిళంలో చాలా సినిమాలు చేసింది. కానీ టక్కున గుర్తు రావాలి అంటే ఖుషి సినిమాలో ఆమె చేసిన అనిత పాత్రే. పవన్ కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించి చిన్న పాత్ర అయినా ప్రేక్షకులను ఆమె మెప్పించింది. తాజాగా ఆమె మీద పోలీసులు బాల కార్మికుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ముంబై లోనే పుట్టి పెరిగి
ముంబైలో పుట్టి పెరిగిన నగ్మా ఖాన్ సినిమాల్లోకి రావడం కోసం తన పేరును ముంతాజ్ మార్చుకుంది. మోనిషా ఎన్ మోనాలిసా అనే సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన ఆమె ఆ తర్వాత మలబార్ పోలీస్ అనే సినిమాలో కూడా నటించింది.. అదే ఏడాది తెలుగులో చాలా బాగుంది అనే సినిమా ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమాలో ఎలాంటి పాత్ర చేయలేదు కానీ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేసి అమ్మో ఒకటో తారీకు సినిమాలో ఆమె గంగ పాత్రలో నటించి మెప్పించింది.

ఖుషి సినిమా తో
తెలుగులో ఆ తర్వాత ఆమె ఖుషి సినిమాలో అనిత పాత్రలో కనిపించి ప్రేక్షకుల అందరికీ దగ్గర అయింది. అయితే తర్వాత ఏమైందో ఏమో పూర్తిగా దూరమైపోయిన తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత జెమిని సినిమాలో కామిని అనే పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఆ తర్వాత కూలీ, కొండవీటి సింహం వంటి సినిమాలలో కనిపించింది. ఆమె చివరిగా తెలుగులో అత్తారింటికి దారేది సినిమాలో ఇట్స్ టైం టు పార్టీ నౌ పాటలో డాన్స్ చేసి అందరినీ మెప్పించింది.

లేబర్ యాక్ట్ కింద
అయితే అసలు విషయానికి వస్తే ముంతాజ్ మీద చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కేసు నమోదయింది. నటి ముంతాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోని అన్నానగర్‌లోని హెచ్‌బ్లాక్ ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె ఇంట్లో కొన్నేళ్లుగా ఉత్తరాదికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పని చేస్తున్నారు. ఇంటిప నుల కాలం ఆ మైనర్ లను వాడుకుంటోంది ముంతాజ్. అయితే వీరిలో ఒక బాలిక ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. తాను,తన సోదరి గత ఆరేళ్లుగా ముంతాజ్ ఇంట్లో పనిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది.

ఇంటికి వెళ్ళనివ్వకుండా
వారు ఇప్పుడు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధం కాగా తమ యజమానులు తమను అనుమతించడం లేదని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు ముంతాజ్ నివాసానికి వెళ్లి అక్కా చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని వారిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వారికి మానసికంగా లేదా శారీరకంగా ఏమైనా హాని జరిగిందా అనే కోణంలో శిశు సంక్షేమ శాఖ ఆరా తీస్తోంది.
Recommended Video


హింసిస్తోంది అంటూ
ముంతాజ్ తమను వేధిస్తోందని, తమను సొంత ఊరికి కూడా పంపడం లేదని, ప్రతి రోజు చిత్ర హింసలు పెడుతోందని, అసభ్యకరంగా మాట్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలికలు. బాలిక ఫిర్యాదు మేరకు ముంతాజ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ముంతాజ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నా ఇప్పటివరకు అయితే అలాంటి వార్తలేవీ బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications











