‘వాళ్లతో కొట్లాడేంత డబ్బు లేదు.. నేను చనిపోయినా ఆ ఫోటోలు షేర్ చేయొద్దు’

ఒకప్పుడు వ్యాంప్ తరహా పాత్రలు పోషించడానికి, ఐటెం సాంగ్స్‌లో నటించడానికి కొందరు నటీమణులు ఉండేవారు. వీరికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండేది. స్వతహాగా మంచి నటీమణులు అయినప్పటికీ.. వ్యాంప్ ముద్ర కారణంగా మంచి పాత్రలు కోల్పోయామని ఎందరో వాపోయారు. ఇక వ్యాంప్ పాత్రల కారణంగా సమాజం తమను భిన్నంగా చూసిందని కన్నీటి పర్యంతమైన వారు కూడా ఉన్నారు. తాజాగా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు తమిళ నాటి ముంతాజ్.

మహారాష్ట్రలోని ముంబైలోని తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు ముంతాజ్. ఆమె అసలు పేరు నగ్మా ఖాన్. దివంగత లెజెండరీ నటి శ్రీదేవికి వీరాభిమాని అయిన ముంతాజ్.. ఆమెలాగే సినిమాల్లో నటించాలని కలలు కన్నది. ముంబైలో చదువుకునే రోజుల్లో ముంతాజ్ స్కూల్ బస్ ... ప్రఖ్యాత ఫిల్మిస్థాన్ స్టూడియో మీదుగా వెళ్లడం కూడా ఆమెపై ప్రభావం చూపించింది. 1999లో తమిళంలో వచ్చిన మోనీషా ఎన్ మోనాలిసా సినిమా ఆమెకు తొలి చిత్రం. ఆమె అందం, రూపం, నవ్వుకు యూత్ పిచ్చెక్కిపోయారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించారు ముంతాజ్.

Actress Mumtaz Gets Emotional for doing Glamour Roles in her career

అమ్మో ఒకటో తారీఖు, కూలీ, కొండవీటి సింహాసనం, పెళ్లికాని పెళ్లాం అవుతుంది, ఖుషి, లూటీ, చాక్లెట్, జెమిని, చెల్లెమె, లండన్ వీరాస్వామి, అత్తారింటికి దారేది, ఆగడు తదితర చిత్రాల్లో నటనతో పాటు స్పెషల్ సాంగ్స్‌కు కుర్రకారులో సెగలు రేపారు. 2018లో బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ముంతాజ్ గట్టి పోటీ ఇచ్చారు. ఏకంగా 91 రోజుల పాటు హౌస్‌లో ఉండి గెలుపు అంచుల వరకు వెళ్లారు. 2015లో తెలుగులో వచ్చిన టామీ చిత్రం తర్వాత ఆమె సినీ రంగానికి దూరమయ్యారు. దాదాపు పదేళ్ల నుంచి ఏ సినిమాలోనూ నటించలేదు. కొద్దినెలల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి ముంతాజ్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గ్లామరస్ రోల్స్ ఎందుకు చేశానా అని బాధగా ఉంది. అంతా బాగానే ఉంది అనుకున్న దశలో నా ఆరోగ్యం చెడిపోయింది. ఓ రోజున విపరీతమైన నడుం నొప్పితో ఎటూ కదల్లేకపోయాను. ఎన్ని చోట్ల చికిత్స చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్ల పాటు ఆ నొప్పిని పంటి బిగువున భరించాను.. ఈ క్రమంలోనే నాకు ఆటో ఇమ్యూనిటీ వ్యాధి ఉన్నట్లు తేలింది. దీని కారణంగా ఒళ్లంతా విలవిలలాడిపోయా.. కూర్చోవడం, నిలబడటమే కాదు శరీరాన్ని కదిలించడం కూడా కష్టమయ్యేది అని ముంతాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చేది. ఈ కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. రోజాంతా ఏడుస్తూనే ఉన్నా.. శారీరకంగానే కాదు, మానసికంగానూ బాధపడేదానిని. ఆ క్లిష్ట పరిస్ధితుల్లో కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. లేదంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయేదానిని. కెరీర్‌లో గ్లామరస్ రోల్స్ చేసినందుకు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను.. ఆ ఫోటోలన్నీ ఇంటర్నెట్‌లో నుంచి డిలీట్ చేయించే స్థోమత నాకు లేదు. కానీ నా అభిమానులెవరూ నా గ్లామర్ ఫోటోలు షేర్ చేయొద్దు.. నేను చనిపోయినా సరే ఆ ఫోటోలు షేర్ చేయొద్దని ముంతాజ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: mumtaz movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X