77 ఏళ్ల వయసులో డేటింగ్ రెడీ.. టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ ముంతాజ్ ఎదురులేని తారగా తన ప్రస్థానాన్ని హిందీ సినిమా పరిశ్రమలో కొనసాగించారు. ఆమెతో జోడి కట్టేందుకు పలువురు హీరోయిన్లు ఎదురు చూసేవాళ్లు. షమ్మీ కపూర్, రాజేశ్ ఖన్నాతో జత కట్టిన ఆమెకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఇప్పటికీ ఆమె ప్రేమ కథా చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా.. తన వయసుకు తగిన లవ్ స్టోరీలు తన వద్దకు తీసుకొచ్చినా.. నాకు నచ్చితే నటించడానికి సిద్దమన్నారు. లెజెండరీ హీరోయిన్ ముంతాజ్ ఫిల్మీబీట్ ప్రైమ్ ఛానెల్‌లో ఏ సే ఆది (A Se Aadi)తో తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను, లవ్, డేటింగ్‌పై తన అభిప్రాయాలను పంచుకొన్నారు. 77 ఏళ్ల వయసులో కూడా డేటింగ్ చేస్తానని చెబుతున్న అలనాటి హీరోయిన్ ముంతాజ్ చెప్పిన విషయాలు ఏమిటంటే?
మంచి పాత్రలు వస్తే..
1958 సంవత్సరంలో ఆమె బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. సోనే కి చుడియా, తలాక్, స్త్రీ, షేరా, హెర్క్కూలస్, టార్జాన్ కమ్స్ టు ఢిల్లీ, మేరే సనమ్, బాక్సర్, బహు బేటీ, యే రాత్ ఫిర్ నా ఆయేగి, ప్యార్ కియే జా, డాకు మంగళ్ సింగ్, హమ్ రాజ్, సీఐడీ 9090, చందన్ కా పాల్ా, గౌరీ, బ్రహ్మాచారి, దో రాస్తే, బంధన్, పర్ దేశీ, హిమ్మత్, రూప్ తేరా మస్తానా, లోఫర్, ఆయ్‌నా, రోటి, లఫంగే, నాగిన్, ఆంధియాన్ సినిమాలో నటించారు. ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్దంగా ఉన్నాను అని అన్నారు.

ప్రేమంటే?
ప్రేమించుకొన్న తర్వాత కలిసి ఉండటమే ముఖ్యం. ప్రేమించుకొన్న వాళ్లు ఎంత మంది పెళ్లి చేసుకొంటున్నారు. పెళ్లి విషయం పక్కన పెడితే.. ఎంతకాలం కలిసి జీవించామనేది ఇంపార్టెంట్. పెళ్లి వల్ల అదనంగా కలిగేది పిల్లల్ని కనడం మాత్రమే. ప్రేమించుకొన్న తర్వాత పరిస్థితులు అనుకూలించక పెళ్లి జరగకపోతే ఒకరి మీద ప్రేమ ఎప్పటికీ తరగదు అని ముంతాజ్ అన్నారు.
బ్రేకప్ అయితే మగవాళ్లు బాధపడరు
షమ్మీ కపూర్‌తో నాకు ఫస్ట్ లవ్. బ్రేకప్ చెప్పాలనుకొన్నప్పుడు నా కెరీర్ గురించే ఆలోచించాను. ఏదైనా నిర్ణయం తీసుకొంటే ఎక్కువగా ఆలోచించను. కానీ షమ్మీకపూర్ బ్రేకప్ తర్వాత చాలా రోజులు ఏడ్చాను. ప్రేమ విఫలమైతే ఆడవాళ్లే ఎక్కువగా బాధపడి ఏడుస్తారు. మగవాళ్లకు అంత బాధ ఉండదు వారు ఏడ్వరు. మహిళలతో పోల్చుకొంటే మగవాళ్లలో స్వచ్ఛమైన ప్రేమ ఉండదు అని ముంతాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నేను డేటింగ్ ఎందుకు చేయొద్దు?
నేను వివాహితను. నాకు నా భర్త నాకు సర్వం ఇచ్చారు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకొనే పరిస్థితి లేదు. నాకు ఎవరైనా నచ్చితే.. వారితో నేను ఎందుకు ఈ వయసులో డేటింగ్ చేయకూడదు. నేను ఎందుకు డేటింగ్ చేయడం ఆపాలి. నేను ఎందుకు నా లైఫ్‌ను కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. దానికి వయసుతో సంబంధం లేదు. లవ్, డేటింగ్‌కు ఎందుకు పుల్‌స్టాప్ పెట్టాలి. నేను ఎందుకు ఒకరిని ప్రేమించకూడదు. నా మనసుకు నచ్చితే నేను ఎందుకు ప్రేమించకూడదు? అంటూ లెజెండరీ యాక్టర్ ముంతాజ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎప్పుడైనా ప్రేమించడానికి రెడీ..
ఏ మహిళ కూడా ప్రేమించడం, ప్రేమలో పడటం, డేటింగ్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఎప్పుడు నీ బాయ్‌ఫ్రెండ్ వదిలేసి వెళ్తాడో. ఎప్పుడూ నీ భర్త వదిలించుకొంటాడో చెప్పలేం. జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు డేటింగ్ చేయడానికి, ప్రేమించడానికి నీవు రెడీగా ఉండాలని అంటాను. మనకు ఎదురుపడే మంచి వ్యక్తుల నుంచి ప్రేమను పొందేందుకు రెడీగా ఉండాలి. నేను ఇలా చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాను. భర్త గానీ, బాయ్‌ఫ్రెండ్ గానీ ఆడవాళ్లను, అమ్మాయిలను వదిలేస్తే వారి పరిస్థితి ఏంటి? అని తన మనసులోని భావాలను కుండ బద్దలు కొట్టినట్టు ముంతాజ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











