అంతా కనిపించే డ్రెస్‌లో ఇస్మార్ట్ పోరి: అలా కూర్చుని మరీ ఫ్రీ షో
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో నభా నటేష్ ఒకరు. తెలుగులో మంచి చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. ఎందుకనో అంతగా ఆఫర్లను అందుకోవడం లేదు. అలాగే, వేరే భాషల్లోనూ పెద్దగా చిత్రాలు చేయట్లేదు. కానీ, నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూడండి!

అలా ఎంట్రీ.. తెలుగులో ఇలా
కర్నాటకకు చెందిన నభా నటేష్ మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అలా ఓ రేంజ్‌లో పాపులర్ అయింది. ఆ సమయంలోనే ఈ అమ్మడు 'వజ్రకాయ' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో నభా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.

ఫుల్ మూవీలు.. ఇస్మార్ట్ హిట్
తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నభా నటేష్.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ వెంటనే 'అదిగో' అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీని చేసి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. దీంతో నభా నటేష్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు భారీ స్థాయిలోనే వచ్చేశాయి.

వరుసగా ఫ్లాప్‌లు.. గ్యాప్ ఇచ్చి
'ఇస్మార్ట్ శంకర్' మూవీ సక్సెస్ అయిన తర్వాత నభా నటేష్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో చాలా వరకూ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. ఫలితంగా నభా నటేష్ యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది. అప్పటి నుంచి సినిమాల్లేక ఖాళీగానే ఉంటోంది.

మహేశ్ మూవీ... ఐటెం సాంగ్
'మాస్ట్రో' మూవీ తర్వాత నభా నటేష్ మరో చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ, ఆమె ఫలానా సినిమాలో భాగం అయిందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు, ఆమె సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, కొన్ని చిత్రాల్లో నభా నటేష్ స్పెషల్ సాంగ్స్ చేస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
చాలా తక్కువ సమయంలోనే మంచి పేరుతో పాటు వరుసగా ఆఫర్లను అందుకున్న నభా నటేష్.. ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ ఫొటోలతో హల్చల్ చేసి
సుదీర్ఘ కాలంగా నభా నటేష్ సోషల్ మీడియాలో యమ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రెచ్చిపోతోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో నభా నటేష్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు తరచూ ట్రెండ్ అవుతోంది.

ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రచ్చ
కొంత కాలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోన్న నభా నటేష్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ ధరించి ఘాటు ఫోజులిచ్చింది. పైగా సోఫాపై కూర్చుని ఎద, తొడ అందాలను ఆరబోస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











