Nabha Natesh: ఎంత రెచ్చిపోతున్నా ఛాన్స్ రావట్లే.. ఇలా చూస్తే మాత్రం దర్శకులు క్యూ కట్టాల్సిందే!
కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎంత దూకుడుగా ఉన్నా కూడా అవకాశాలు మాత్రం చాలా తక్కువగా వస్తాయి. అలాగే మొదట్లో సక్సెస్ అందుకున్న వారు కూడా ఆ తర్వాత మెల్లమెల్లగా వారి స్థాయిని పోగొట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మొదట్లో గ్లామర్ పరంగానే కాకుండా కమర్షియల్ హిట్స్ పరంగా కూడా మంచి విజయాలు సొంతం చేసుకున్న నాభా నటేష్ కు ఇటీవల మాత్రం అవకాశాలు కూడా అందడం లేదు.
ఇక అమ్మడు సరికొత్తగా తన గ్లామర్ ను హైలెట్ చేసుకుంటోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే. మళ్ళీ దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ చుట్టూ తిరుగుతారు అని చెప్పవచ్చు. ఇక ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోల వివరాల్లోకి వెళితే..

మొదటి కమర్షియల్ బిగ్ హిట్: నబా నటేష్ అనగానే అందరికీ కూడా ఎక్కువగా ఒకే ఒక్క సినిమా గుర్తుకొస్తూ ఉంటుంది. పూరీ జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మాస్ కమర్షియల్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో అమ్మడు ఎలా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో గ్లామర్ డోస్ హైలెట్ కావడమే కాకుండా తన తెలంగాణ యాసతో కూడా కుర్రాళ్ళ మనసు దోచేసుకుంది. ఎలాంటి పాత్ర చేసిన కూడా అమ్మడు హై ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది అని చాలాసార్లు రుజువు చేసింది.

వరుసగా డిజాస్టర్స్: నాభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ బాగానే అందుకున్నా.. ఆ తర్వాత మాత్రం వరుసగా అపజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కమర్షియల్ గా ఆలోచించి ఎక్కువగా మాస్ రొటీన్ కథలను సెలెక్ట్ చేసుకుంది. అయితే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ సినిమాతో పాటు ఆ తర్వాత సోలో బ్రతికే సో బెటర్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

ఎన్ని అపజయాలు ఎదురవుతున్నా: అయితే ఎన్ని అపజయాలు ఎదురవుతున్నా కూడా ఈ బ్యూటీ మాత్రం అస్సలు వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో అవకాశాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే కొన్ని మంచి కంటెంట్ ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలు కూడా చేయాలని ఆసక్తిని చూపిస్తోంది. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇప్పట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టుకోకుండా అవసరమైతే తక్కువగా కూడా తీసుకొని మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటుందట.

లేటెస్ట్ లుక్ వైరల్: ఇక నభా నటేష్ సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా అందంతో మాత్రం సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు షేక్ చేస్తూనే ఉంది. ఈ బ్యూటీ గతంలో చాలా సార్లు ఘాటైన అందాలతో కుర్రాళ్ల మతిపోగొట్టేసింది. అయితే ఈసారి ఒక లంగా జాకెట్ లో అమ్మడు ఒక వైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు ఘాటైన లుక్స్ తో మాత్రం స్టన్ అయ్యేలా చేసింది. అలాగే ముక్కుపుడకపెట్టుకొని మరింత అందంగా కనిపించింది.

ఇలానే కంటిన్యూ చేస్తే: నభా నటేష్ అందాలను చూసి ఆమె ఫాలోవర్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. గతంలో ఎప్పుడూ కూడా మరి ఇంత అందంగా కనిపించలేదు అని ఇదే తరహాలో ముందుకు కొనసాగితే చాలామంది దర్శక నిర్మాతలు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెబుతున్నారు. ఇక నభా అయితే రెగ్యులర్గా గ్లామరస్ ఫోటోలతో చాలా వైరల్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మాయికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











