twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎదురింటబ్బాయితో ప్రేమ... సల్మాన్ ఖాన్ సినిమా వదులుకున్న నదియా

    |

    సీనియర్ నటి నదియా గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు. నటిగా ఆమె అందరికీ తెలుసు కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా లవ్ స్టోరీ గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు అంటే అత్త, అమ్మ వంటి పాత్రలో హుందాతనంగా నటించి అదరగొడుతోంది కానీ ఒకప్పుడు నదియా స్టార్ హీరోయిన్. ఇప్పుడు ఆమె రొమాంటిక్ లవ్ స్టోరీ, వ్యక్తిగత జీవితం సంబంధించి ఆమె బయట పెట్టిన కొన్ని ఆసక్తికర విషయాలు ఆమె స్వయంగా బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఫిలింఫేర్ అవార్డు

    ఫిలింఫేర్ అవార్డు

    మలయాళ దర్శకుడు ఫాజిల్ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఆమె హీరోయిన్ కావడం యాదృచ్చికంగా జరిగిందట. ఓసారి ఫాజిల్ నదియా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి, మమ్ముట్టి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అడిగారట. నదియా తండ్రికి ఆమెను ఆడిషన్స్ తీసుకురమ్మని చెప్పారట. ఇంకేముంది నదియా తండ్రి ఆమెను ఆడిషన్స్ తీసుకెళ్లడం, హీరోయిన్ గా ఎంపికవ్వడం, సినిమా చేయడం వెంట వెంటనే జరిగిపోయాయని ఆమె వెల్లడించారు. 1984లో విడుదలైన నదియా మొదటి మలయాళ చిత్రం నొక్కేతదురతు కన్నుం నట్టు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఫస్ట్ సినిమాకి ఆమె ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.

    ప్రేమ చిగురించింది కానీ

    ప్రేమ చిగురించింది కానీ

    ఇంకేముంది మలయాళ, తమిళ భాషల్లో ఆమెకు ఆఫర్ క్యూ కట్టాయి. అయితే నిజానికి నదియా హీరోయిన్ కావాలని అనుకోలేదు. ఆమె చిన్నప్పుడు టీవీలో వచ్చే యాడ్స్ ఇంట్రెస్టింగ్ చూసేవారట. పెద్దయ్యాక తాను కూడా ఇలాంటి యాడ్స్ చేయాలని, వాటికి డైరెక్టర్ అవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అయితే ఇంటర్ చదువుతున్న రోజుల్లో మీ ఇంటికి ఎదురుగా ఉండే శిరీష గాడ్బోలే అనే కుర్రాడిని ఇష్ట పడడంతో అన్నీ మారిపోయాయట. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది కానీ చదువు పూర్తి చేసి విదేశాల్లో స్థిరపడాలన్నది శిరీష్ లక్ష్యం. అందుకే నదియా యాడ్ మేకర్ అవ్వాలనుకున్నా తన లక్ష్యాన్ని త్యాగం చేసిందట. శిరీష్ ఉద్యోగంలో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ జంట.

    తారుమారయ్యే అవకాశం

    తారుమారయ్యే అవకాశం

    అయితే అనుకోకుండా శిరీష్ అమెరికా వెళ్ళగానే నదియా ఇండియాలో హీరోయిన్ గా ఎదిగింది. అప్పట్లో విదేశాల్లో ఉన్న వారితో మాట్లాడాలి అంటే ఇప్పుడు ఉన్నట్టు సోషల్ మీడియా, సెల్ ఫోన్ వంటి సౌకర్యాలు లేవు. టెలిగ్రామ్ రాయాలి లేదంటే ట్రంక్ కాల్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. అయితే షూటింగ్ వల్ల శిరీష్ తో మాట్లాడటం కుదిరేది కాదట. ఇక శిరీష్ కి అమెరికాలో ఉద్యోగం రావడంతో నదియా వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించి 1988లో తన ప్రియుని పెళ్లాడింది. పెళ్లి కుదరగానే సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మైనే ప్యార్ కియా చిత్రంలో నదియాకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. మంచి ఆఫర్... అయినప్పటికీ పెళ్లి కుదరడంతో ఏదైనా తేడా జరిగితే పరిస్థితి దారుణంగా తారుమారయ్యే అవకాశం ఉందని భావించి నో చెప్పేసిందట.

    త్యాగాలు చాలు

    త్యాగాలు చాలు

    మైనే ప్యార్ కియా చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదైతేనేం పెళ్లి తర్వాత ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి భర్తతో పాటు అమెరికా వెళ్లి సెటిలైంది నదియా. ఈ జంట ఇద్దరు అమ్మాయిలకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక సినిమా జీవితాన్ని పూర్తిగా వదిలేసి కుటుంబాన్ని చూసుకుంటున్న నదియాకు అమ్మానాన్న తమిళ అమ్మాయి రీమేక్ లో ఒక పాత్ర ఆఫర్ చేశారు దర్శకుడు ఎం రాజా. ఇదే విషయాన్ని భర్తతో చెప్పగా ఇప్పటి వరకు తన కోసం చేసిన త్యాగాలు చాలు... నీకు ఇష్టమైతే సినిమాల్లో నటించమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.

    వరుస సినిమా అవకాశాలు

    వరుస సినిమా అవకాశాలు

    తెలుగులో అప్పటికే హీరోయిన్ గా రౌడీ బజార్ లో తండ్రి కూతురు మంచి చిత్రాలు చేసిన నదియా మిర్చి మూవీలో ప్రభాస్ తల్లిగా సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేశారు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పవర్ ఫుల్ అత్తగా నటించిన నదియా పాత్రను ఎవరు మాత్రం మరిచిపోగలరు? ప్రస్తుతం నదియా తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె గని, సర్కారు వారి పాట, అంటే సుందరానికి చిత్రాల్లో కనిపించారు. త్వరలో విడుదల కానున్న రామ్ పోతినేని ది వారియర్ మూవీలో కూడా నదియా కీలక పాత్ర పోషిస్తున్నారు.

    English summary
    actress nadhiya reveals her love story in a recent intreview, and how she missed salman khan movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X