ఇంకా ఫినిష్ కాలేదు.. అలా అనుకొంటే తప్పే.. ఆ పోటీకి రెడీ.. నగ్మా
దేశవ్యాప్తంగా ఆరుకుపైగా భాషల్లో ఒక ఊపు ఊపిన నటి నగ్మా. దక్షిణాదిలో అగ్ర హీరోలతో జతకట్టి మెప్పించిన గ్లామర్ తారగా నగ్మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. యువ హీరోయిన్ల తాకిడికి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నగ్మాను టీఎస్ఆర్, టీవీ9 అవార్డుల్లో లైఫ్ టైమ్ అవార్డు అందుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

ఇంకా కెరీర్ ముగియలేదు
లైఫ్ టైమ్ అవార్డు అందుకొన్నామంటే కెరీర్ ముగిసిపోయినట్టు కాదు. నా ప్రతిభకు, సినిమాల పట్ల అంకితభావం ఉన్నందుకు గాను ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నాను. టీఎస్సార్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అని నగ్మా అన్నారు.

సినిమాలకు దూరంగా ఎందుకంటే
కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాను. రాజకీయాలు, సామాజిక సేవ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. త్వరలోనే సినిమాల్లో నటిస్తాను. ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నాను అని నగ్మా చెప్పారు.

రాజీవ్ గాంధీ అవార్డుకు..
సామాజిక సేవ చేస్తున్న నేపథ్యంలో రాజీవ్ గాంధీ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మార్చి నెలలో అవార్డుల ప్రధానం సందర్బంగా నాకు అవార్డును అందజేయనున్నారు అని నగ్మా చెప్పారు.

నగ్మాకు 17న లైఫ్ టైమ్ అవార్డు
విశాఖపట్నంలో ఫిబ్రవరి 17న క్రికెట్ మైదానంలో జరిగే అవార్డుల కార్యక్రమంలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో నగ్మాను సత్కరించనున్నారు. ఈ అవార్డుల ఎంపిక కార్యక్రమానికి నగ్మా న్యాయ నిర్ణేతగా కూడా ఉన్నారు. అవార్డుల ఎంపిక కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పారు.


Click it and Unblock the Notifications











