పెళ్లిపై స్పందించిన నగ్మ.. ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే!

90 దశకంలో నగ్మ గ్లామర్ హీరోయిన్ గా యువత ఓ ఊపు ఊపింది. నగ్మ అంటే యువత పిచ్చెక్కిపోయేవాళ్లు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నగ్మా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. వెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య లాంటి స్టార్ హీరోలందరి సరసన నగ్మ ఆడిపాడింది. 45 ఏళ్ల వయసొచ్చినా నగ్మ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తాజాగా పెళ్లి గురించి ప్రశ్నించగా నగ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తనకు వివాహ జీవితంపై నమ్మకం ఉందని నగ్మ తెలిపింది. సరైన సమయం వచ్చినప్పుడు తన వివాహం ఖచ్చితంగా జరుగుతుందని నగ్మ తెలిపింది. తనకు తనకు తగిన వ్యక్తి దొరికితే వివాహం చేసుకుంటానని తెలిపింది. నా వివాహం అందరి సమక్షంలోనే జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన జీవితంలో ఎవరూ లేరని, ఒంటరిగానే ఉన్నట్లు నగ్మ తెలిపింది.

 Actress Nagma finally opens up about her marriage

టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నగ్మ మధ్య ఘాడమైన ప్రేమ కొనసాగింది. 2001 లో తామిద్దరం ప్రేమించుకున్నామని నగ్మ పలు సందర్భాల్లో తెలిపింది. కానీ నా కారణంగా సౌరవ్ కెరీర్ పాడవుతుందేమోనని తాను అతడితో రిలేషన్ నుంచి తప్పుకున్నట్లు నగ్మ తెలిపింది. మా ఇద్దరికి ప్రేమ కంటే కెరీర్ ముఖ్యం అందుకే విడిపోయినట్లు నగ్మ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X