twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నమిత.. కాస్త ఆలస్యంగా చెప్పిన నటి

    |

    ఈ మధ్య హీరోయిన్స్​ అందరూ గుడ్​ న్యూస్​ చెబుతూ తమ ఫ్యాన్స్​కు, ప్రేక్షకులకు సంతోషాన్ని పంచుతున్నారు. స్టార్​ హీరోయిన్స్​ కాజల్​ అగర్వాల్, ప్రణిత సుభాష్, బిపాసా బసు తదితర హీరోయిన్లు తమకు పిల్లలు పుట్టిన విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందాల భామ నమిత పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ సంతోషకరమైన విషయాన్ని పండుగ పూట తెలిపి మరింతగా సెలబ్రేట్​ చేసుకుంది. ఆగస్టు 6వ తేదినే కవలల పిల్లలను ప్రసవించిన నమిత ఈ విషయాన్ని ఆలస్యంగా కృష్ణాష్టమి పండుగ సందర్భంగా తెలియజేసింది.

    సొంతం సినిమాతో..

    సొంతం సినిమాతో..

    విక్టరీ వెంకటేష్​ నటించిన జెమినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బ్యూటిఫుల్​ హీరోయిన్ నమిత. తెలుసునా.. తెలుసునా అంటూ సొంతం సినిమాతో మరింత దగ్గరయింది. ఆ తర్వతా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసిన స్టార్​ హీరోయిన్​గా ఎదగలేకపోయింది.

    చివరిగా 2016లో..

    చివరిగా 2016లో..

    ఇక సినిమాలు లేక కాస్త బొద్దుగా మారిన నమిత ప్రభాస్​ బిల్లాలో హాట్​గా అందాలు వడ్డించింది. తర్వాత బాలకృష్ణ సింహ మూవీతో ఆకట్టుకుంది. అనంతరం మళ్లీ వెండితెరకు కనుమరిగిపోయింది. ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, నాయకుడు వంటి సినిమాలతో ఆకట్టుకున్న నమిత చివరిగా 2016లో వచ్చిన మన్యం పులి సినిమాలో కనిపించింది.

    మే నెలలో..

    మే నెలలో..

    ఇక సినిమాలకు దూరంగా ఉన్న నమిత ఆంధ్రప్రదేశ్​కు చెందిన కోలీవుడ్ యాక్టర్​ వీరేంద్ర చౌదరిని 2017లో వివాహం చేసుకుంది. ఈ ఏడాది మే నెలలో తన పుట్టిన రోజు సందర్భంగా తాను గర్భవతినంటూ అభిమానులకు శుభవార్త తెలిపింది. అప్పటి నుంచి బేబీ బంప్​తో దిగిన ఫొటోలను షేర్​ చేస్తూ సోషల్​ మీడియాలో తన ఫాలోవర్స్​కు అప్​డేట్​ ఇస్తూ వచ్చింది.

    పరోక్షంగా డెలీవరి హింట్​..

    పరోక్షంగా డెలీవరి హింట్​..

    ఇక తాజాగా ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పండుగ పూట అభిమానులకు తెలిపింది. అయితే ఆమె ఆగస్టు 6నే ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఆరోజు కూడా నమిత కార్లో ప్రయాణిస్తూ పరోక్షంగా తన డెలివరీ గురించి వెల్లడించింది. కానీ పూర్తిగా ఏ విషయం అప్పుడు చెప్పలేదు.

    ఇన్​స్టా గ్రామ్​లో వీడియో..

    ఇక తాజాగా ఆమెకు ఇద్దరు మగ పిల్లలు జన్మించినట్లు ఆగస్టు 19న సోషల్​ మీడియా వేదికగా తెలిపింది నమిత. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో షేర్​ చేసింది. ''హరే కృష్ణ. ఈ శుభ సందర్భంలో సంతోషకరమైన వార్తను మీ అందరితో షేర్​ చేసుకోవడానికి సంతోషిస్తున్నాం.

     మీ ఆశీర్వాదం కావాలంటూ..

    మీ ఆశీర్వాదం కావాలంటూ..

    మాకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు అబ్బాయిలే. మీ ఆశీర్వాదాలు, ప్రేమ వారికి ఎల్లప్పుడూ ఉంటాయని మేం ఆశీస్తున్నాం. ప్రెగ్నెన్సీ సమయంలో నాకు మార్గ నిర్దేశం, డెలివరీకి సహాయం చేసిన డాక్టర్ భువనేశ్వరి, ఆమె టీమ్​కు నేను రుణపడి ఉంటాను'' అని ఆ వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ కాగా.. పెళ్లికి ముందు తమిళ బిగ్​బాస్​లో పాల్గొంది నమిత.

    English summary
    Actress Namitha Blessed With Twin Baby Boys And Shares Through Instagram Video On Krishnashtami Festival
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X