ప్రభాస్‌తో లవ్వా.. తండ్రి లాంటివాడితో ఇలాంటి రూమర్స్ దారుణం: సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ డోస్ బాలీవుడ్ లో పెరిగింది. బాహుబలి అనంతరం ప్రభాస్‌కి సంబంధించిన ప్రతి వార్త వైరల్ ఆవుతోంది. ఇక పెళ్లి గురించి వారు సౌత్ మీడియా కంటే హై రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. ఇక ఫైనల్ గా హాట్ బ్యూటీ నమిత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ప్రభాస్ పై వచ్చిన రూమర్స్ గురించి స్పందించారు.

 ప్రభాస్‌తో నమిత..

ప్రభాస్‌తో నమిత..

ప్రభాస్‌కి సంబంధించిన ప్రేమ వార్తలు రావడం ఇప్పుడు కొత్తేమి కాదు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ రూమర్స్ డోస్ డిఫరెంట్ గా పెరుగుతున్నాయి. అయితే గతంలో నమిత, ప్రభాస్‌ల మధ్య డేటింగ్ నడిచినట్లు రూమర్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లినట్లు కూడా కొన్ని మీడియాలలో కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వీరు రూమర్స్ పై పెద్దగా క్లారిటీ కూడా ఇవ్వలేదు.

 ఆ సినిమాలో కెమిస్ట్రీ అదుర్స్..

ఆ సినిమాలో కెమిస్ట్రీ అదుర్స్..

నమిత, ప్రభాస్ కలిసి బిల్లా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. 2009లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సమయంలో ప్రభాస్, అనుష్కల మధ్య కూడా లవ్ నడిచినట్లు టాక్ వచ్చింది. అదే సమయంలో ఊహించని విధంగా నమిత పేరు కూడా వినిపించడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక ఆ సినిమాలో ప్రభాస్ నమిత మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనే పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.

 ప్రభాస్‌తో లవ్వా..

ప్రభాస్‌తో లవ్వా..

ఇక ఫైనల్ గా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నమిత తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అయితే అందులో ఎక్కువగా ప్రభాస్‌కి సంబంధించిన రూమర్ ఒకటి వైరల్ అయినట్లు చెప్పారు. ఆయనతో లవ్వేమిటి అని ఆశ్చర్యపోయా.. అప్పట్లో బిల్లా ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మా ఇద్దరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అందుకే ఆ రూమర్స్ క్రియేట్ చేశారని నమిత వివరణ ఇచ్చారు.

Recommended Video

Bottu Movie Official Theatrical Trailer | Filmibeat Telugu
తండ్రి లాంటివాడితో..

తండ్రి లాంటివాడితో..

ఇక తనపై వచ్చిన మరొక రూమర్ గురించి కూడా నమిత క్లారిటీ ఇచ్చింది. సీనియర్ యాక్టర్ శరత్ బాబును తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయని నిజంగా అది తనను ఇబ్బందికి గురి చేసినట్లు తెలిపింది. ఎందుకంటే ఒక తండ్రి లాంటి వ్యక్తితో అలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం నిజంగా దారుణమని నమిత ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X