ఆ అభిమాని నాకు మొగుడయ్యేవాడు..కిడ్నాప్ చేసి, సంచలన విషయం బయటపెట్టిన హీరోయిన్

భారతదేశంలో సినిమా ఒక మతమైతే, సినీనటులు ఇలవేల్పులు . వారి పుట్టినరోజులు , సినిమా రిలీజ్‌లు ఉన్నప్పుడు రక్తదానం, అన్నదానంతో పాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొందరు తారలకు గుడులు కట్టి పూజించిన అరివీర భయంకర అభిమానులు మనదేశంలో ఉన్నారు. నార్త్‌లో ఏమో కానీ సౌత్‌లో ఈ పిచ్చి ఫ్యాన్స్ ఎక్కువ. దక్షిణాదిలో అభిమానులు గుడి కట్టి పూజలు చేసిన తారల్లో నమిత ఒకరు. ఆమె జీవితంలో జరిగిన ఓ పీడకల లాంటి అనుభవాన్ని నమిత బయటపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

సూరత్‌లో పుట్టి పెరిగిన నమిత.. 2002లో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సొంతం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నమిత. చబ్బి చబ్బిగా ఉండే నమితను తెలుగువారు బాగానే ఇష్టపడ్డారు. ఆ వెంటనే జెమినీ, ఒకరాజు ఒకరాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి సినిమాల్లో నటించింది. కానీ అంతగా స్టార్‌డమ్ దక్కకపోవడంతో కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. విజయ్ కాంత్ హీరోగా నటించిన ఎంగల్ అన్న ద్వారా తమిళ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది.

Actress Namitha Vankawala Revealed Her Kidnap Story here s the details

స్వతహాగా ముద్దుగా, బొద్దుగా ఉండే అమ్మాయిలను ఇష్టపడే తమిళ తంబీలకు నమిత బాగా కనెక్ట్ అయ్యింది. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో నమిత కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. ఆమె నటనకు, అందానికి ఫిదా అయిన తమిళ ప్రేక్షకులు నమితకు గుడికట్టి పూజలు చేశారు. చాలా ఏళ్లు తెలుగు తెరకు దూరమైన నమిత బిల్లా, సింహా సినిమాలతో మరోసారి హిట్స్‌ను అందుకున్నారు. అయినప్పటికీ అవకాశాలు రాలేదు. దీంతో చెన్నైలోనే స్థిరపడాలని నమిత నిర్ణయించారు. కొత్త అమ్మాయిల రాకతో పాటు భారీగా బరువు పెరగడంతో నమిత మునుపటి లుక్ కోల్పోయారు. మియా మూవీ ఆమె నటించిన చివరి సినిమా. అందులో నటించిన వీరేంద్ర చౌదరితో ప్రేమలో పడ్డ నమిత 2017 నవంబర్ 24న ఆయనను పెళ్లాడింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది, గుడి కట్టించుకున్న నమితకు ఇటీవల ఓ ఆలయంలోనే చేదు అనుభవం ఎదురైంది. గత నెలలో కృష్ణాష్టమి సందర్భంగా నమిత తన కుటుంబ సభ్యులతో కలిసి మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమెను హిందూ మతం అవలంభిస్తున్నట్లుగా ధ్రువీకరణ పత్రం అడిగారు. ఈ విషయాన్ని స్వయంగా నమిత వెళ్లడించింది. ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారగా.. ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు. తాము నమితతో ఎవరూ దురుసుగా వ్యవహరించలేదని, ఆలయ నియమ నిబంధనల ప్రకారమే ప్రవర్తించామని వివరణ ఇచ్చారు.

ఇదిలాఉండగా.. ఓ అభిమాని అత్యుత్సాహం నమితకు జీవితంలో పీడకలగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత ఈ విషయాన్ని వెల్లడించారు. 2009లో ఓ షూటింగ్‌లో పాల్గొనేందుకు కోయంబత్తూరుకు వెళ్లానని.. ఎయిర్‌పోర్టులో దిగగానే తాను మీ డ్రైవర్‌నంటూ ఓ వ్యక్తి వచ్చాడని నమిత చెప్పారు. తానే , మేనేజర్‌ నిజమేనని అనుకున్నామని కారెక్కామని.. తాను పాటలు వింటూ నిద్రపోయానని లేచి చూసేసరికి తాము దిగాల్సిన స్పాట్ రాకపోవడంతో డౌట్ వచ్చిందని నమిత తెలిపారు.

ఆ వెంటనే తమ కారును ఐదారు వాహనాలు వెంటాడాయని.. అది చూసిన మేనేజర్ మనం కిడ్నాప్‌ అయ్యామని చెప్పడంతో తాను షాక్ అయ్యానని అన్నారు. నన్ను కిడ్నాప్ చేసిన నా అభిమాని నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని నమిత సంచలన విషయం బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: namitha vankawala movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X