మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వచ్చినా.. అందులో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్ కెరీర్లతో సాగిపోతోన్నారు. కానీ, మరికొందరు మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు పడుతూ కెరీర్లను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. అందానికి అందం, నటనకు నటన ఉన్నా అదృష్టం లేక నానా కష్టాలు పడుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. కెరీర్ పరంగా అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే నందినీ రాయ్ తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిని మీరు కూడా చూసేయండి మరి!

మిస్ ఆంధ్రాగా ఎంపికైన నందినీ
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ మోడల్‌గా ఫుల్ ఫేమస్ అయింది. ఆ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అప్పుడే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి అందరి దృష్టిలో పడిపోయింది.

హీరోయిన్‌గా.. తెలుగులో మాత్రం
పేరుకు తెలుగు నేపథ్యం ఉన్న అమ్మాయే అయినా నందినీ రాయ్ నార్త్‌లోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి వచ్చి 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటివి చేసింది.

బిగ్ బాస్ ఎంట్రీ... క్రేజ్ రెట్టింపు
సుదీర్ఘమైన ప్రయాణంలో తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కు ఆశించిన రీతిలో గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా మధ్యలోనే వెళ్లిపోయింది. కానీ క్రేజ్‌ను పెంచుకుంది.

తగ్గిన ఆఫర్లు.. అలాంటి వాటిలో
వాస్తవానికి బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిన్నది 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది. ఇలా చిన్న ఆఫర్లకూ ఓకే అనేస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా
ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయినా.. నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను వదులుతూ తరచూ హైలైట్ అవుతోంది.

అప్పుడప్పుడూ అందాలతో వల
కెరీర్ పరంగా అంత సక్సెస్ కాలేకపోతోన్న నందినీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటోంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దీని ద్వారా హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో నందినీ రాయ్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఫలితంగా ఆమె నిత్యం వార్తల్లో ఉంటోంది.

మేకప్ రూంలో నందినీ హాట్‌గా
సోషల్ మీడియాలో చాలా కాలంగా తెగ సందడి చేస్తోన్న నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె మేకప్ రూమ్‌లో చిన్న బ్లౌజ్, లెహంగాతో ఫోజులిచ్చింది. తద్వారా ఆమె ఎద, నాభి అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











