బీచ్లో బికినీతో రచ్చ చేస్తున్న తెలుగమ్మాయి నందినీ రాయ్.. అందాలు ఆరబోస్తూ ట్రీట్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండిట్లో సందడి చేస్తున్నారు. మేము కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేది లేదంటూ రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ భామ నందినీ రాయ్ కూడా ఒకరు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ చిన్నది, తరువాత హీరోయిన్‌గా మారి తన మార్కు వేసుకోవాలని చూసినా ఆమె అనుకున్నంత సక్సెస్ అయితే అందలేదు. ఎలా అయినా మంచి ఆఫర్లు పట్టాలని చూస్తున్న ఆమె సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ హీటు పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నందినీ కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఆ సంగతి ఏంటో చూద్దామా!

మోడలింగ్ చేస్తూ
సినిమాల మీద ఆసక్తితో ఎలా అయినా సినిమాల్లో నటించాలని అనుకుంది అయితే దానికంటే ముందే నందినీ రాయ్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. మోడలింగ్ చేస్తున్న క్రమంలోనే ఆమె చాలా తక్కువ సమయంలో తన అందచందాలతో మంచి గుర్తింపును దక్కించుకోవడమే కాక పలు అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఆంధ్రాగా కూడా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా మారి నేషనల్ లెవల్లో గుర్తింపు దక్కించుకుంది.

సినిమాల్లో ఎంట్రీ
హైదరాబాదీ అయినా మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ కారణంగా నందినీ రాయ్ ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లో ఆమెకు ఫస్ట్ సినిమా వచ్చింది. 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఆయనే ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లో కూడా అడుగెట్టింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాలు చేసినా నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదనే చెప్పాలి.
అవకాశాల కోసం
అనుకోకుండా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెకు కొంత గుర్తింపు అయితే దక్కింది. షోలో చాలా సైలెంట్ గా ఉండి, టాస్కుల్లో చక్కగా ఆడినా మధ్యలో ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ తర్వాత తెలుగులో ఆఫర్లు వస్తాయని అనుకున్నా అవకాశాలు పెద్దగా దక్కట్లేదు. దీంతో సినిమా అయితే చాలు అనుకుంటూ ఏదో ఒకటి చేసేస్తోంది.
బోల్డు అయినా రెడీ
'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఇక వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుకోవడం కోసం ఆమె తన అందాలను ఎర వేస్తోంది. తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ హల్‌చల్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
బీచ్లో బికినీతో
నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్ ఒడ్డున బికినీతో కనిపించింది. ఇక ఆ ఫొటోలలో తన ఎద అందాలు ఆరబోస్తూ తొడలు కనిపించే విధంగా ఉండటంతో నెటిజన్ల నుంచి మంచి ఫాలోయింగ్ దక్కుతోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











