అమ్మాయిలు వెళ్లడం కళ్లారా చూశా.. తెలుగు డైరెక్టర్ బాగోతం బయటపెడతా: నందినీ రాయ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అవగా.. మిగిలిన వాళ్లంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో హైదరాబాద్ చిన్నది నందినీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే ఎంటరైన ఈ భామ.. అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంరట్వ్యూలో నందినీ రాయ్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఓ డైరెక్టర్‌పై ఆరోపణలు చేసింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!

మిస్ ఆంధ్రాగా పాపులారిటీ
హైదరాబాద్ అమ్మాయి నందినీ రాయ్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ సమయంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. అలా మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైంది. దీంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. ఆ తర్వాత నందినీ నేషనల్ రేంజ్‌లో సైతం మోడల్‌గా సందడి చేస్తూ చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. తద్వారా పాపులర్ అయింది.

Actress Nandini Rai Sensational Comments on Casting Couch

అలా మొదలు.. ఆ మూవీల్లో
మోడల్‌‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే నందినీ రాయ్‌కు చాలా భాషల నుంచి సినిమా అవకాశాలు భారీగా వచ్చాయి. దీంతో ఈ అమ్మడు 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో ఆమె హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి కూడా వచ్చింది. అనంతరం 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమస్
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సందడి చేస్తోన్నప్పుడే నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, అందంతో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టిలో పడిపోయింది. దీంతో మంచి పేరు కూడా తెచ్చుకుని చాలా రోజులు షోలో కొనసాగింది. దీని తర్వాత నందినీ బాగా ఫేమస్ అయింది. కానీ, ఆమెకు అనుకున్న రీతిలో ఆఫర్లు రాలేదు.

Actress Nandini Rai Sensational Comments on Casting Couch

ఇప్పుడు ఆ మూవీలు చేస్తూ
అందం, నటనతో చాలా కాలంగా మాయ చేస్తోన్న నందినీ రాయ్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావట్లేదు. కానీ, ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది 'గాలి వాన' సిరీస్‌తో పాటు 'వారిసు', 'భాగ్ సాలే', CSI Sanatan మూవీలు చేసింది. అలాగే, మరికొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇప్పుడు పలు ప్రాజెక్టులు చేస్తోంది.

వాళ్లు వెళ్లడం కళ్లారా చూశా
నందినీ రాయ్ కొద్ది రోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను మాట్లాడింది. ఈ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. 'చాలా మంది అమ్మాయిలు ఇష్టంతోనే వెళ్తున్నారు. అలా వెళ్లడం నేను కళ్లారా చూశాను. ప్రతి రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అలాగే సినిమాల్లోనూ ఉంటుంది' అని ఆమె వివరించింది.

Actress Nandini Rai Sensational Comments on Casting Couch

డైరెక్టర్ నన్ను తప్పించాడు
ఇదే ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్‌లో జరిగిన కొన్ని చేదు సంఘటనలను కూడా నందినీ పంచుకుంది. 'ఇష్టం లేని పనులు చేయడం నచ్చకపోవడంతో కొన్ని సినిమా ఆఫర్లు వదులుకున్నాను. కొన్నింట్లో తప్పించారు. టాలీవుడ్‌లో ఓ బడా డైరెక్టర్ కూడా నన్ను కావాలనే ఓ వెబ్ సిరీస్ నుంచి తీసేశాడు. ఆయన బాగోతం త్వరలోనే బయటపెడతాను' అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X