ఆ ఒక్క రీజన్ వల్ల RX 100 సినిమా మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?
ఆర్ఎక్స్ 100 సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సెన్సెషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించగా... కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్.. మొదట నందితా శ్వేతకు వచ్చిందట. కానీ ఆ ఒక్క రీజన్ వల్ల.. ఆమె ఆర్ఎక్స్ 100 సినిమాను వదలుకుందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్...: 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సెన్సెషన్ సృష్టించింది. అప్పటి వరకు హీరోయిన్ అంటే.. పాజిటివ్ యాంగిల్ లో చూపించే దర్శకులు.. ఈ సినిమాతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అజయ్ భూపతి తన మొదటి సినిమాతోనే.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ సినిమాలో హీరోగా కార్తికేయ చేయగా.. హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ చేసింది. ఇక ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే మొదట పాయల్ రాజ్ పుత్ కంటే ఆ రోల్ ఛాన్స్ నందిత శ్వేతకు వచ్చిందట.

ఆ కారణం వల్లేనట...: ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది నందితా శ్వేత. ఇక ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఈ ముద్దు గుమ్మకు మొదట ఆర్ఎక్స్ 100 సినిమా ఛాన్స్ వచ్చిందట. కానీ ఆమె ఈ పాత్రకు నో చెప్పిందట. కారణం.. హీరోయిన్ బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయడం.. అండ్ పాత్ర వేరియన్స్. అలా చేస్తే.. ఫ్యూచర్ లో తనకు మంచి క్యారెక్టర్స్ రావేమోనని భయపడి ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట.

హిడింబ ప్రమోషన్స్ లో...:ఈ విషయాన్ని స్వయంగా నందిత శ్వేత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నందిత శ్వేత నటించిన చిత్రం హిడింబ. ఓంకార్ తమ్ముడు అశ్వీన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రచారపర్వం మొదలు పెట్టింది. ఈ ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు ఆర్‌ఎక్స్ 100 సినిమా గురించి చెప్పుకొచ్చింది. ఆర్‌ఎక్స్100 సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. పాయల్ రాజ్ పుత్ పాత్ర తనకు మొదట రాగా.. రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. దానికి కారణం బోల్డ్ కంటెంట్ అని.. వెల్లడించింది. ఇక ఈ సినిమాలో పాయల్ ఆ సినిమాకు వంద శాతం న్యాయం చేసిందని తెలిపింది.

నిర్మాతలకు కాసుల వర్షం:ఇక ఆర్ఎక్స్ విషయానికి వస్తే... ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర మాములు షాక్ కాదు. అప్పటికే ఓ అబ్బాయిని ప్రేమించి... పెళ్లికి కూడా సిద్ధమైన అమ్మాయి.. మధ్యలో శారీరక సుఖం కోసం ఇంకొక అబ్బాయిని లైన్లో పెడుతుంది. అతణ్ని శారీరకంగా వాడుకుని వదిలేయడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు మాములు షాక్ ఇవ్వలేదు. ఈ ట్విస్టే నిర్మాతల పాలిట.. కాసుల వర్షం కురిపించింది. ఇక దాదాపు యూత్ అంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయి బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు.


Click it and Unblock the Notifications











