For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ డైరెక్టర్ అలా మోసం చేశాడు.. ఎంత చెత్తగా అంటే.. నయనతార బయటపెట్టిన నిజం

  |
  Nayanatara Reveals Her Bitter Experience With Kollywood Star Director || Filmibeat Telugu

  అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్‌గా కీర్తించబడుతోంది నయనతార. సౌత్ సినిమా ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకున్న ఈ భామ తన అందచందాలతో వెండితెరకు కొత్త అందం తీసుకొచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దూకుడుగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ భామ తెలుగు, తమిళ, మళయాళ సినీ పరిశ్రమలోని అందరు అగ్ర హీరోలతో ఆడిపాడింది.

  అందం, అభినయం రెండూ కలగలుపుతూ ప్రేక్షకులను కనువిందు చేస్తున్న ఈమె పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తన ప్రతిభ చాటి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకుంది. అయితే కెరీర్ ఆరంభంలో ఆమె చేసిన రెండు సినిమాల గురించి, ఆ అనుభవాల గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నయన్. తానో చెత్త డిసీజన్ తీసుకొన్నాని ఇన్నాళ్లకు బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక వివరాల్లోకి వెళ్తే..

  గజినీ, చంద్రముఖి..

  గజినీ, చంద్రముఖి..

  నయనతార కెరీర్ ఆరంభంలోనే ‘‘గజినీ, చంద్రముఖి'' సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలతోనే ఆమె లోని ప్రతిభ బయటపడింది. దీంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి క్యూ కట్టారు.

  మార్చేసి చుపించారంటూ ఆవేదన

  మార్చేసి చుపించారంటూ ఆవేదన

  అప్పట్లో సూపర్ హిట్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది ‘గజినీ' చిత్రం. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా.. ఆసిన్ మెయిన్ హీరోయిన్‌గా, నయన్ రెండో హీరోయిన్‌గా నటించారు. అయితే దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు తన పాత్ర గురించి ఒకలా చెప్పి.. చివరకు సిల్వర్ స్క్రీన్‌పై మరోలా చూపించారంటూ నయన్ ఆవేదన చెందింది.

   చంద్రముఖి అనుభవం

  చంద్రముఖి అనుభవం

  తన కెరీర్‌లో ‘గజినీ' సినిమా చేయడమే ఓ చెత్త నిర్ణయం అని నయన్ పేర్కొనడం గమనార్హం. తన పాత్ర పరిధిని చాలా కుదించేసి ఇందులో చూపించారని చెప్పిన ఆమె.. గజినీ సినిమా అనుభవం తర్వాత పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త పడ్డానని చెప్పుకొచ్చింది. అదే ‘చంద్రముఖి' సినిమా విషయానికొస్తే అందులోనూ తాను చిన్న పాత్రే చేసినప్పటికీ సూపర్బ్ స్క్రీన్ ప్రెసెన్స్ చేశారని, ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపింది నయనతార. అయితే ఇన్నేళ్లకు గజిని పట్ల నయన్ ఇలా స్పందించడం చూసి ఆశ్చర్యపోతున్నారంతా. చూడాలి మరి దీనిపై మురుగదాస్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది.

  నయన్ స్టెప్పులు

  నయన్ స్టెప్పులు

  కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగిన నయన్.. నేటికీ తన సత్తా చాటుతూనే ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నటిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అదే మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్' సినిమా సెట్స్‌పై చురుకుగా కదులుతోంది. ఇవిగాక ‘‘మిస్టర్ లోకల్, తలపతి 63'' చిత్రాల్లో నటిస్తోంది నయన్.

  English summary
  Actress Nayanatara revealed bitter experience with Director AR Murugadoss as well as good moments with Chandramukhi movie team. Now She is doing Darbar with Rajinikanth, Sye Raa Narsimha Reddy with Chiranjeevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X