ఓ మైగాడ్.. అందంతో మెరిసి.. చూసుకొని మురిసిన నయనతార
అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న నయనతార తన ప్రియుడితో కలిసి విషు పండుగను ఆనందంగా జరుపుకొన్నది. కేరళలో హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకొనే పండుగ కోసం ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి తన సొంత పట్టణం కోచికి ఇటీవల ప్రత్యేక విమానంలో చేరుకొన్న సంగతి తెలిసిందే. ఈ పండుగ సందర్భంగా అందంగా ముస్తాబై తనకు తానే మురిసిపోయింది నయనతార. విషు పండుగ సందర్బంగా దిగిన సెల్ఫీని తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఓ మైగాడ్.. నా ఫోటోనే నేను చూసుకొన్న తర్వాత ఎప్పుడెప్పుడూ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయాలా అనే ఆతృత కలిగింది. విషు పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ సుందరిని, ఆమె స్టన్నింగ్ లుక్స్‌ను ఓ సారి చూడండి అంటూ నయనతార తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నది.

నయనతార ప్రస్తుతం రజనీకాంత్, కీర్తి సురేష్, కుష్బూతో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్ర షూటింగులో కుష్భూ, కీర్తి సురేష్, ప్రకాశ్ రాజ్, మీనా తదితరుల పాల్గొంటున్నారు. అలాగే సమంత, విజయ్ సేతుపతితో కలిసి వాకులా రెండు కాదల్ చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











