50 సెకన్లకు రూ.5 కోట్లు.. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరంటే..?

India's Most Highest Paid Actress: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది నటులు, నణీమణులు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. వారు తమ స్టార్ హోదాకు తగినట్టుగా సినిమాల్లో, యాడ్స్ ల్లో నటిస్తున్నారు. అయితే.. ఓ హీరోయిన్ కొన్ని సెకన్ల యాడ్ కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందట. సెకన్ల యాడ్ అంటున్నారు.. కోటి.. లేదా రెండు కోట్లో తీసుకుంది కావొచ్చు అనుకుంటారు. కానీ ఈ బ్యూటీ కేవలం 50 సెకన్ల యాడ్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందట. ఇంతకీ అమ్మడు ఎవరో ఊహించండి..

సెకన్ల యాడ్ లో నటించి 5 కోట్లు తీసుకుందంటే.. ఈ బ్యూటీ కియారా అద్వానీ నో.. అలియా భట్.. కత్రినా కైఫ్ .. లేదా ఐశ్వర్యారాయ్ కావచ్చని అనుకుంటున్నారా? అయితే.. మీరు పప్పులో కాలేసినట్టు.. ఆ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కానే కాదు. ఇంకో హింట్ ఏంటంటే.. అది కూడా మన టాలీవుడ్ స్టార్ అండ్ సౌత్ ఇండియన్ సార్ట్ హీరోయిన్. సెకన్ల యాడ్ కు కోట్లు వసూల్ చేసే సౌత్ ఇండియన్ బ్యూటీ ఎవరు ?

Actress Nayanthara charged Rs 5 crore for a satellite dish connection tata sky advertisement

ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదండీ.. సౌత్ ఇండియన్ హీరోయిన్ నయనతార. సౌత్ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆమెను చాలా మంది సౌత్ 'లేడీ సూపర్ స్టార్' అని పిలుస్తారు. దక్షిణాది హీరోయిన్లలో ఆమెనే హాయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. మొట్టమొదటగా నయనతార 2003లొ మళయాళ మూవీ మనసినక్కరే తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ సరసన నటించి మంచి పాపులర్టీ దక్కించుకుంది.

ఈ అమ్మడు సినిమాల్లో నటించడానికి కూడా భారీ మొత్తంలోనే వసూలు చేస్తోంది. మీడియా కథనాల ప్రకారం, నటి ఒక చిత్రానికి దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. గతేడాది బాలీవుడ్‌లో కూడా తొలిసారిగా నయన్ మెరిసింది. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ 'జవాన్‌' తో బాలీవుడ్ లోకి కూడా ఎంటీ ఇచ్చింది నయనతార. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. భారీ వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ చిత్రంలో నటించినందుకు భారీ మొత్తంలో రెమ్యూరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. తన రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో 75కి పైగా చిత్రాల్లో ఆమె నటించి మెప్పించింది. ఎన్నో అవార్డు అందుకుంది.

ఇదెలా ఉంటే.. ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటా స్కై యాడ్ లో నటించడానికి నయనతార భారీ మొత్తం రెమ్యూనరేషన్ వసూలు చేసిందంట. ఈ టాటా స్కై యాడ్ ను రెండు రోజలు షూట్ చేశారంట. తమిళం, తెలుగు, మలయాళం , కన్నడ భాషలలో ఈ యాడ్ ప్లే అవుతోంది. కేవలం 50 సెకన్ల ప్రకటన కోసం దాదాపు 5 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు వసూలు చేసి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా రికాడ్డు క్రియేట్ చేసింది నయనతార.

Actress Nayanthara charged Rs 5 crore for a satellite dish connection tata sky advertisement

ఇక నయనతార నెట్ వర్త్ గురించి తెలుసుకుంటే షాక్ కావాల్సిందే. చాలా మంది హీరోయిన్స్ ఆమె నెట్ వర్త్ ను టచ్ కూడా చేయలేరు. పలు నివేదికల ప్రకారం.. నటి నయనతార.. చాలా లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. దాదాపు రూ.100 కోట్లకు ఆమె ఓనర్. నయనతారకు ముంబైలో 4 బెడ్‌రూమ్ లగ్జరీ ఫ్లాట్ ఉంది. ఇది కాకుండా.. ఆమెకు సౌత్‌లో విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇక ఆమె కార్ల గురించి మాట్లాడితే.. BMW 5 సిరీస్, BMW 7 సిరీస్, టయోటా ఇన్నోవా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి అలాగే..నయన తారకు అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

More from Filmibeat

Read more about: nayanthara tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X