ప్రియుడి కోసం చెట్టును పెళ్లాడుతున్న నయనతార.. ఐశ్వర్యరాయ్ బాటలోనే..

సినిమా ఇండస్ట్రీలో తారల మధ్య కొనసాగే ప్రేమలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఇక ఎవరు ఏమనుకున్నా కూడా కొంత మంది సినీ తారలు వారికి నచ్చిన తరహాలోనే ముందుకు సాగుతూ ఉంటారు. గత కొంత కాలంగా నయనతార పెళ్లి పై అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని ఆమె గత రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నారు. మీడియా ఆ విషయంలో ఎప్పుడూ ప్రశ్నించినా కూడా తమ జీవితం గురించి తమకు తెలుసునని చాలాసార్లు కౌంటర్ ఇచ్చాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా నయనతార కాబోయే భర్త కోసం ఒక ఆచారాన్ని పాటించనున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి విషయంలో ముందే ఒక క్లారిటీ

పెళ్లి విషయంలో ముందే ఒక క్లారిటీ

నయనతార - తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ కూడా గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా అనేక రకాల రూమర్స్ సైతం వైరల్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో అయితే సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ పెళ్లి విషయంలో మాత్రం విగ్నేష్ శివన్ చాలా క్లారిటీ గా ఉన్నట్లు డైరెక్ట్ గా మీడియాకు తెలియజేశాడు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో తమకు బాగా తెలుసుని.. అయినా తాము సాధించాల్సింది ఇంకా చాలా ఉందని కూడా తెలియజేశాడు.

 క్రిస్టియన్ అయినప్పటికీ..

క్రిస్టియన్ అయినప్పటికీ..

పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా కూడా విగ్నేష్ నయనతార ఇద్దరూ కూడా భార్య భర్తల తరహాలోనే ఇప్పటికే దేశవిదేశాలు చుట్టేశారు. ఎన్నో హాలిడే ట్రిప్స్ కి కూడా వెళ్లారు. నయనతార తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎన్నో ఖరీదైన కానుకలను కూడా ఇచ్చింది. ఇక వీరు కేవలం విదేశాలకు వెళ్లడమే కాకుండా అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలకు కూడా వెళుతున్నారు. పుట్టుకతోనే నయనతార క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఆమె హిందూ సంప్రదాయాలను చాలా గౌరవంగా ఇష్టంగా పాటిస్తోంది.

దోషం పోయేందుకు..

దోషం పోయేందుకు..

ఇటీవల కాలంలో నయనతార అనేక రకాల హిందూ దేవాలయాలను సందర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు పుణ్యక్షేత్రాలను కూడా ఆమె సందర్శించి హోమాలు యాగాలు కూడా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇద్దరు జాతకాలను చూసిన తర్వాత నయనతార దోషం పోయేందుకు ఒక చెట్టును పెళ్లాడబోతున్న ట్లు తెలుస్తోంది.

ఐశ్వర్యరాయ్ తరహాలోనే చెట్టుతో పెళ్లి

ఐశ్వర్యరాయ్ తరహాలోనే చెట్టుతో పెళ్లి

గతంలో విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కూడా అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకోబోయే ముందు మూడు రకాల విభిన్నమైన చెట్లను ఆమె పెళ్లి చేసుకుంది. అనవసరంగా కాబోయే భర్త ప్రాణాలకు కలలో కూడా అపాయం కలగకూడదు అని సెలబ్రిటీలు ఇలా పలు సాంప్రదాయాలను ఆచారాలను పాటిస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా నమ్మని రోజులలో ఇలాంటి వాటిని సెలబ్రిటీలు పాటిస్తూ ఉండటం కొంత విశేషం అనే చెప్పాలి.

Recommended Video

Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
కాబోయే భర్త కోసమే..

కాబోయే భర్త కోసమే..

ఇక నయనతార కూడా తనకు కాబోయే భర్త క్షేమం కోసం హిందూ సంప్రదాయాలను పూజలను నిర్వహిస్తోంది. ఆమె పెళ్ళికి ఎలాంటి ఆటంకం కలగకూడదని అలాగే పెళ్లి తర్వాత కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని ఒక దోషం పోయేందుకు ముందుగా ఒక చెట్టును పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం బయటకు రాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యంత గోప్యంగా పూజలను నిర్వహించబోతున్న ట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X