OG movie: ఓజీ మూవీలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ మిస్.. క్లారిటీ ఇచ్చిన సుజీత్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ మూవీ OG. యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సుజిత్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ చిత్రం ఇది. సెప్టెంబర్ 25న తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా నార్మల్ ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ ను ఇస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల స్పందనను పొందడమే కాకుండా ఇటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పరంగాను OG చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో రిలీజ్ కు ముందు అభిమానులు ఎంతగానో అంచనాలను పెంచుకున్నారు. ఇక రిలీజ్ తర్వాత అభిమానులను, ఆడియన్స్ ను OG చిత్రం సంతృప్తి పరిచింది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, డైరెక్టర్ సుజీత్ గ్రాండ్ టేకింగ్, యాక్షన్ సీన్లు, సౌండ్ ట్రాక్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

Actress Neha Shetty Special Song Missed in Pawan Kalyan OG Movie

అయితే OG చిత్రానికి సంబంధించి రిలీజ్ కు ముందు చాలా సర్ప్రైజ్ లో ఉన్నాయంట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో ఒకటి యంగ్ హీరోయిన్ నేహా శెట్టి స్పెషల్ సాంగ్. డీజే టిల్లు చిత్రంతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించి మెప్పించింది. రాధికా పాత్రలో తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. దాంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు అందుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్‌లోని OG చిత్రంలో నేహా శెట్టికి బంపర్ ఆఫర్ తగిలిందని ప్రచారం జరిగింది. OG చిత్రంలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ ఉంటుందని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్త చక్కర్లు కొట్టింది. దీంతో పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ తో పాటు మరోవైపు స్పెషల్ సాంగ్ తో మరో మెట్టు ఎక్కుతుందని, OG క్రేజ్ తో మరింత ముందుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ తీరా ఓజీ చిత్రం విడుదలైన తర్వాత అందులో నేహా శెట్టి సాంగే లేకపోవడం తో అందరూ షాక్ అయ్యారు.

అయితే, నేహా శెట్టి స్పెషల్ సాంగ్ పై తాజాగా OG మూవీ సక్సెస్ మీట్ లో దర్శకుడు సుజీత్ స్పందించారు. ఎందుకు OG మూవీలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ మిస్ అయ్యిందని వచ్చిన ప్రశ్నలకు సుజీత్ ఆసక్తికరంగా బదులిచ్చారు. అసలు ఆ సాంగ్ ఉంటుందని మేము చెప్పలేదన్నారు. అలాగే థమన్ ను కూడా మీరేమైనా స్పెషల్ సాంగ్ ఉంటుందని చెప్పారా? అని మీడియా ముందే అడిగి అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని తేల్చేశారు. కాగా OG చిత్రంతో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.

More from Filmibeat

Read more about: pawan kalyan neha shetty og movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X