టిల్లుగాళ్ల గుండెలకు చిల్లు పడేలా నేహా శెట్టి పరువాల విందు.. కుర్రాళ్లకు మత్తెక్కించే అందాలతో!

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నేహా శెట్టి ఒకరు. డీజే టిల్లుతో రాధికగా ఈ బ్యూటీ కి కలిసి వచ్చిన అదృష్టం ఇంకా కంటిన్యూ అవుతోంది. తాజాగా నేహ శెట్టి రెడ్ డ్రెస్ లో పరువాల విందు చేసిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

డీజే టిల్లు మూవీతో రాధికగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. మూవీలో ఆమె గ్లామర్ మాయలో పడిపోయిన కుర్రాళ్ళు నేహా అసలు మర్చిపోయి, సినిమాలోని ఆమె రోల్ రాధికగానే పిలుచుకుంటున్నారు. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ మూవీ థియేటర్లోకి రావడంతో మరోసారి అందరి కళ్ళు రాధికపై పడ్డాయి. ఈ మూవీలో నేహా గెస్ట్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే.

Actress Neha Shetty stunning and Sizzling Photos goes viral in Red Dress

ఇక డీజే టిల్లు ఇచ్చిన బ్రేక్ తో ప్రస్తుతం వరుస ప్రాజెక్టుతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది నేహా శెట్టి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను ఫాలో అవుతూ ఇలా పాపులారిటీ ఉన్నప్పుడే టిల్లు తనకు ఇచ్చిన ఈ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం నేహా శెట్టి టాలీవుడ్ యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది.

చివరగా ఈ అమ్మడు కిరణ్ అబ్బవరంకు జోడిగా రూల్స్ రంజన్ మూవీలో కనిపించింది. కానీ ఆ మూవీ పెద్దగా హిట్ కాలేదు. అలాగే మరో యంగ్ హీరో కార్తికేయ సరసన బెదురులంక 2012 మూవీలో నటించి ఆకట్టుకుంది.

ఇక తాజాగా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరోసారి సోషల్ మీడియాలో రాధిక పేరు వైరల్ గా మారింది. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నేహా శెట్టి రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

పూర్తిగా రెడ్ కలర్ లో ఉన్న ప్యాంటు షర్ట్ ధరించిన నేహా శెట్టి పరువాలు కనిపించేలా ఫోజులిచ్చి యూత్ కి కనుల విందు చేస్తోంది. ఆ ఫోటోలు చూసిన నెటిజెన్లు ఈ కవ్వింపులకే కదా నీకు ఫిదా అయ్యింది రాధిక అంటూ టిల్లు స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.

డీజే టిల్లు సక్సెస్ తర్వాత నేహా శెట్టి ట్రెడిషనల్ గా కనిపించిన, మోడ్రన్ డ్రెస్ లో హాట్ హాట్ గా మెరిసినా సినీ ప్రియులకు తెగ నచ్చేస్తోంది. ఇక ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ నేహా ఇంకా స్టార్ హీరోల కంటికి ఆనట్లేదు. మరి అమ్మడికి స్టార్ హీరోల సరసన ఆఫర్ ఎప్పుడోస్తుందో? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆమె అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X