జాకెట్ విప్పేసి నిహారిక హాట్ షో: కాబోయే వదిన ఊహించని కామెంట్
టాలీవుడ్‌లోకి ఎంతో మంది సినీ స్టార్ల వారసులు పరిచయం అయ్యారు. కానీ, అందులో అమ్మాయిలు మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. అలా వచ్చిన స్టార్ కిడ్లలో మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల ఒకరు. చాలా కాలం క్రితమే గ్లామర్ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. హీరోయిన్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చి.. ఈ మధ్య మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. దీంతో మరిన్ని ఆఫర్లను పట్టేస్తుంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి మరి!
అప్పుడే వచ్చి.. సినిమాల్లేవు: నటిగా మారడానికి ముందే నిహారిక 'ఢీ' షోతో యాంకర్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను చేసింది. ఈ క్రమంలోనే 'ఒక మనసు' మూవీతో హీరోయిన్‌గా వచ్చి.. తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్ ఇవ్వలేదు.

పెళ్లి తర్వాత నిర్మాతగానూ:హీరోయిన్‌గా చేసిన సినిమాలన్నీ పరాజయం పాలవడంతో నిహారిక సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. ఆ సమయంలోనే చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని పెళ్లాడింది. అయితే, వివాహం తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగించింది. అయితే, గతంలో మాదిరిగా యాక్టింగ్ చేయకున్నా.. నిర్మాతగా మారి 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వంటి సిరీస్‌లు తీసింది.
భర్తకు విడాకులు అంటూ: చైతన్యతో ఏడడుగులు నడిచిన తర్వాత నిహారిక కొణిదెల తన వైవాహిక జీవితాన్ని కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతుందని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. అలాగే, ఈ మధ్య జరిగిన వరుణ్ ఎంగేజ్‌మెంట్‌లోనూ నిహారిక భర్త కనిపించలేదు.

బోల్డు యాక్టింగ్.. వాటిలోనూ:నిహారిక కొణిదెల ఇటీవలే 'డెడ్ పిక్సల్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌లో ఈ మెగా డాటర్ బోల్డుగా కనిపించింది. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా వదిలింది. దీంతో ఆమె యమ ట్రెండింగ్ అయింది. ఇక, ఇప్పుడు కూడా నిహారిక యాక్టింగ్ మీద ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కొన్ని సిరీస్‌లు, సినిమాల్లోనూ నటిస్తోంది.
అందులో బిజీగా.. హాట్ షో:మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఈ మధ్య డోస్ పెంచేసి మరీ ఓ రేంజ్‌లో హాట్ షో చేసేస్తోంది.

జాకెట్ తీసేసి మరీ ట్రీట్:సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న నిహారిక కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పైన వేసుకున్న జాకెట్‌ను విప్పేసి మరీ ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ ఫోజులిచ్చింది. వీటిలో నిహారిక లేలేత అందాలు కొసరి కొసరి కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

లావణ్య కామెంట్.. వాళ్లేమో:మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి పాజిటివ్ అండ్ నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది 'చాలా హాట్‌గా ఉన్నావు', 'ఇంత అందాన్ని ఇంత కాలం ఎక్కడ దాచావు', 'ఇలాంటివి అవసరమా' అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. ఇక, నిహారికకు కాబోయే వదిన లావణ్య త్రిపాఠి 'హాట్' అని కామెంట్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











