For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తలకు గన్ పెట్టి టాలీవుడ్ హీరోయిన్ దోపిడీ.. సినీ ఫక్కీలోనే రేప్ చేస్తారని రాత్రంతా అల్మారాలో!

  |

  ఒక బాలీవుడ్ నటి ఢిల్లీ ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కొన్నారు. అచ్చం సినిమాల్లో జరిగినట్టే ఢిల్లీలోని శాస్త్రి నగర్‌లోని గన్ పాయింట్ లో బాలీవుడ్ నటిని అటకాయించిన కొందరు దొంగలు సుమారు రూ .7 లక్షలు దోచుకున్నారు. షాకింగ్ గా అనిపిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

  బాలీవుడ్ టు టాలీవుడ్

  బాలీవుడ్ టు టాలీవుడ్

  నటి నికితా రావల్ బాలీవుడ్ తో పాటు దక్షిణాది బాషల సినిమాల్లో కూడా నటించింది. ఆమె "మిస్టర్ హాట్ మిస్టర్ కూల్", "ది హీరో - అభిమన్యు", "గరం మసాలా", అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం "క్యూట్ కామినా" వంటి సినిమాల్లో నటించింది. ముంబైలో నివసించే నికిత, 'మిస్టర్ హాట్ మిస్టర్ కూల్' మరియు 'ది హీరో-అభిమన్యు' సినిమాలతో పాటు, ఆమె అర్షద్ వార్సీ యొక్క రాబోయే చిత్రం 'రోటీ కప్డార్ రొమాన్స్' లో కూడా కనిపించనుంది.

  ఇక నిఖిత 2007లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ‘మిస్టర్‌ హాట్‌.. మిస్టర్‌ కూల్‌'లో సహా నటిగా చేశారు. అలాగే అనిల్‌ కపూర్‌ ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌'తో పాటు పలు చిత్రాల్లో ఆమె నటించారు. అంతేగాక 2012 నుంచి ఆమె తెలుగులోనూ పలు చిత్రాల్లో చేశారు. అలాగే ఆమె నటించిన ఓ సినిమా తెలుగులో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే ఆమె దోపిడీకి గురి కావడం సంచలనంగా మారింది.

  ఆమె ఇంటి వద్దే దోచుకున్నారు

  ఆమె ఇంటి వద్దే దోచుకున్నారు

  ఢిల్లీలోని శాస్త్రి నగర్ ప్రాంతం నుండి చాలా షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. షూటింగ్ కోసం ఢిల్లీ చేరుకున్న నటి నికితా రావల్ ను తుపాకీతో బెదిరించి ఏడు లక్షల రూపాయలు దోచుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముసుగు ధరించిన దుండగులు నికితా రావల్‌ని ఆమె ఇంటి వద్దే దోచుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు, ఆమె తన అత్త ఇంటి వైపు ఒంటరిగా నడుస్తోంది.

  ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ తాను ఈ సంఘటన నుంచి ఇంకా కోలుకోలేదని ఆమె చెప్పింది. దుర్మార్గులు తనపై అత్యాచారం చేస్తారని నికిత భయపడింది, దీంతో ఆమె వెళ్లి ఒక అల్మారా లోపల దాక్కుంది. ఇక కాస్త తేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ ఘటన జరిగిన వెంటనే ఆమె ముంబైకి తిరిగి పయనం అయింది.

  తుపాకీ నా తలకు గురి పెట్టి

  తుపాకీ నా తలకు గురి పెట్టి

  ఈ సందర్భంగా నికిత మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ఓ సినిమా షూటింగ్‌ కోసం వెళ్లగా అక్కడే ఉంటున్న మా బంధువుల ఇంటికి వెళ్లాను. అయితే ఆ సమయంలో మా ఆంటీ ఇంట్లో లేరు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఓ రోజు షూటింగ్‌ ముగిశాక రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మా ఇంటికి సమీపంలోకి రాగానే ఓ ఇన్నోవా కారు వేగంగా నా వైపుకు వచ్చి ఆగింది. వెంటనే కారు నుంచి నలుగురు వ్యక్తులు బయటకు దిగారు, వారంతా నల్లటి మాస్క్‌లు ధరించి ఉన్నారు. అందులో ఒక వ్యక్తి తుపాకీ నా తలకు గురి పెట్టి నా దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఇవ్వమని బెదిరించాడని పేర్కొంది.

  తీసుకెళ్లి రేప్

  తీసుకెళ్లి రేప్

  ఆ సయమంలో ఒంటిపై ఉన్న బంగారు ఉంగరం, చెవి కమ్మలు, వాచ్‌, డైమండ్‌ పెండెంట్‌, డబ్బులను అన్నిటినీ దోచుకుని వెళ్లారు' అని ఆమె వివరించారు. ఆ సమయంలో ఆ వ్యక్తులు నన్ను ఎక్కడికో తీసుకెళ్లి రేప్ చేయవచ్చని, నన్ను చంపి వేయచ్చు అని కూడా భావించాను అని అందుకే నేను ఏమీ ఎదురు చెప్పకుండా వారికి అన్నీ ఇచ్చాను.

  నేను వెంటనే ఇంటికి వెళ్లి ఇంటిని లోపలి నుంచి లాక్ చేసి అల్మారాలో దాక్కున్నాను. మరుసటి రోజు ఉదయం నేను ముంబైకి తిరిగి వచ్చాను, ఎందుకంటే అక్కడ నాకు భద్రత లేదు అని పించింది అని ఆమె పేర్కొంది. ఇక ఈ సంఘటన ఆదివారం తనకు జరిగిందని నటి చెప్పింది. ఈ ఘటనతో నేను చాలా భయపడ్డాను, అని అందుకే నేను వెంటనే ముంబైకి తిరిగి వచ్చాను. నేను FIR దాఖలు చేయడానికి కూడా వేచి ఉండలేదని పేర్కొంది. నేను నా లాయర్‌తో మాట్లాడాను కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నేనే వెళ్లాల్సి ఉంటుందని, నాకు ధైర్యం వస్తే నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెళ్తానని ఆమె చెప్పారు.

  రాజ్ కుంద్రా కేసుతో తెరమీదకు

  రాజ్ కుంద్రా కేసుతో తెరమీదకు

  ఇక నికిత రావల్ ఇటీవల నిర్మాత రాజ్ కుంద్రా అరెస్టుపై స్పందించినప్పుడు వెలుగులోకి వచ్చింది, అలాగే శిల్పా శెట్టి పేరు ఈ కేసులో అనవసరం అని చెప్పింది. ఈ విషయంలో ఆమె పేరు లాగబడింది అని నికిత పేర్కొంది. 'నాకు రాజ్ కుంద్రా కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. నేను ఇంతకు ముందు 3-4 సార్లు అతడిని కలిసాను. వార్త తెలుసుకున్న నేను షాక్ అయ్యాను. కానీ ముంబై పోలీసులు విడుదల చేసిన వారి వాట్సాప్ చాట్‌లు మరియు పోలీసులు ఏమి చెబుతున్నారో చూశాను, అతను ఈ రాకెట్‌ను నడుపుతుంటే అది చాలా బాధాకరం అని పేర్కొంది.

  English summary
  Nikita Rawal was held hostage at gunpoint in Delhi and robbed of Rs 7 lakh, actress recalls the incident and said that she dreaded getting raped.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X