అలాంటి అఫైర్లు పెట్టుకొను.. ఎవరైనా దొరికితే పెళ్లికి రెడీ.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన నిక్కి తంబోలి

చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన నిక్కి తంబోలి ప్రస్తుతం బాలీవుడ్‌లో హంగామా సృష్టిస్తున్నది. హాట్ హాట్‌ వార్తలతో నిత్యం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నది. తాజాగా సౌతాఫ్రికాలో రియాల్టీ గేమ్‌ షోలో పాల్గొని తిరిగి వచ్చిన నిక్కి తంబోలి... బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. నిక్కి తంబోలి చెప్పిన విషయాలు ఏమిటంటే...

బిగ్‌బాస్ 13 రియాలిటీ షోలో

బిగ్‌బాస్ 13 రియాలిటీ షోలో

తెలుగు సినిమా పరిశ్రమలో గరంగరంగా నటించినా పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేని నిక్కి తంబోలి.. బిగ్‌బాస్‌ 13లో మెరిసిన తర్వాత ఆమె హిందీ పరిశ్రమలో హాట్ హాట్‌గా మారింది. ఏకంగా బిగ్‌బాస్‌లో రెండో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత బాలీవుడ్ టాప్ సెలబ్రిటీగా మారిపోయింది.

ఖత్రోంకి ఖిలాడీ 11 సీజన్‌లో

ఖత్రోంకి ఖిలాడీ 11 సీజన్‌లో

దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్‌గా రూపొందించే ఖత్రోంకి ఖిలాడీ 11 సీజన్‌లో నిక్కి తంబోలి పాల్గొన్నది. అయితే ఆ గేమ్ షోలో పెద్దగా రాణించలేకపోయింది. కానీ దక్షిణాఫ్రికా సముద్ర తీరంలో బికినీలో కనిపించి సెన్సేషన్ రేపింది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి మీడియా తన భావాలను పంచుకొన్నది.

టైంపాస్ రిలేషన్స్ పెట్టుకొను

టైంపాస్ రిలేషన్స్ పెట్టుకొను

నిక్కి తంబోలి తన రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుతూ.. గత బ్రేకప్స్ నాకు మంచి గుణపాఠాలను నేర్పింది. ఇక ముందు నేను టైంపాస్ రిలేషన్‌షిప్స్ పెట్టుకొను. కావాలంటే నేను పెళ్లి చేసుకొని స్థిరపడుతాను. ప్రస్తుతం నా కెరీర్ మీదే నేను దృష్టిపెడుతాను అని నిక్కి తంబోలి చెప్పింది. ప్రేమ, రిలేషన్‌షిప్స్ పేరుతో నేను ఒకరి జీవితాన్ని నాశనం చేయనని క్లారిటీ ఇచ్చేసింది.

ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే...

ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే...

ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలడానికి నాకు సమయం లేదు. టైంపాస్ అఫైర్లతో నేను కాలం గడపలేను. మరొకరికి నేను సమయాన్ని వెచ్చించలేదు. ఈ రోజు ఎవరైనా నాకు మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం. ఇప్పుడు నాకు నా కెరీరే చాలా ముఖ్యం అంటూ నిక్కి తంబోలి వేదాంతం వొలకబోసింది.

నా చీర కొంగులా పొడువులా ఉండాలని..

నా చీర కొంగులా పొడువులా ఉండాలని..

తాజాగా నిక్కి తంబోలి నల్ల చీరలో దర్శమిచ్చింది. నల్ల చీరలో నిగ నిగలాడుతూ ఉన్న ఈ బ్యూటీ ఫోటో వైరల్ అయింది. జీవితం చాలా చిన్నది. నా కొంగు అంతా పొడువుగా ఉండాలని కోరుకొంటున్నాను అని నిక్కి తంబోలి ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నది. ఇటీవల కరోనావైరస్ కారణంగా తన సోదరుడిని కోల్పోయిన ఆమె జీవితంపై వేదాంతం ప్రదర్శస్తుందనే విషయం స్పష్టమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X