ప్రభాస్ గురించి తెలియదంటే కావాలనే అల్లరి చేశారు.. చాలా కుంగిపోయా, , నిత్య మీనన్ ఆవేదన!

అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది నిత్య మీనన్. తన అందంతో అభినయంతో చాలా తక్కువ సమయంలో మంచి అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ మధ్య ప్రభాస్ ఎవరో తనకు తెలియదు అని ఆమె చేసిన కామెంట్లు ఆమెను పెద్ద ఎత్తున ట్రోలింగ్ బారిన పడేలా చేశాయి. తాజాగా ఆ విషయాల మీద ఆమె నోరు విప్పింది. వివరాల్లోకి వెళితే..

 పక్కన పెట్టినట్లే

పక్కన పెట్టినట్లే

ఒకప్పుడు అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన నిత్యామీనన్ తర్వాత వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తనదైన నటనతో ఎక్కడ అశ్లీలతకు, అసభ్యతకు చోటు ఇవ్వకుండా కేవలం పద్ధతిగా ఉండే పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. దీంతో స్వతహాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆమెను పక్కన పెట్టినట్లే చెప్పాలి.

నిర్మాతగా కూడా సక్సెస్

నిర్మాతగా కూడా సక్సెస్

అలా ఆమె మళ్ళీ తెలుగు సినిమాలు వరుసగా ఒప్పుకోవడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అందుకుంది నిత్యామీనన్.

పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో

పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో


అంతేకాక ఆమె గమనం అనే సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించగా ఆ సినిమాకి ఎంత పేరు వచ్చిందో అంత పేరు ఆమె కూడా తెచ్చుకుంది..ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ భీమానాయక్ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది

హర్ట్ అయ్యా

హర్ట్ అయ్యా


తాజాగా మీడియాతో మాట్లాడిన నిత్యామీనన్ తనకు తెలుగు సినీ పరిశ్రమలో ఎదురైన అనేక విషయాలు గురించి చెప్పుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకు బాగా పెద్ద దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే అని ఆమె చెప్పుకొచ్చారు. అది ఇప్పటికీ మానసికంగా బాధ పెడుతూనే ఉంటుంది అని అన్నారు.. తన గురించి జర్నలిస్టులు అందరూ తప్పుగా రాయడంతో హర్ట్ అయ్యాను అని, ఎందుకంటే అలా మొదలైంది సినిమా వచ్చినప్పుడు నేను చాలా చిన్నదాన్ని అని ఆమె అన్నారు.

అప్పుడే నేర్చుకున్నా

అప్పుడే నేర్చుకున్నా


నేను కూడా కొత్తగా వచ్చాను అని చెప్పుకొచ్చారు. అప్పుడు నాకు తెలుగు కూడా సరిగా రాదు, తెలుగు సినిమాలు చూడలేదు అప్పుడు నన్ను ప్రభాస్ గురించి అడిగితే నాకు తెలియదు అని చెప్పాను అని ఆమె వెల్లడించారు. అప్పుడు తన అమాయకత్వాన్ని ఉపయోగించుకుని చాలా చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి నేను తప్పు చేసినట్లు న్యూస్ క్రియేట్ చేశారని హానెస్ట్ గా అన్ని చోట్ల ఉండకూడదని అప్పుడే నేర్చుకున్నానని ఆమె వెల్లడించారు.

 విషయాన్ని పెద్దది చేశారు

విషయాన్ని పెద్దది చేశారు

ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకుని అలాగే ఉండాలని భావించానని, ఇండస్ట్రీలో ఎలా మెలగాలో అర్థం అయింది అని వెల్లడించింది. అప్పుడు నాకు నిజంగానే ప్రభాస్ తెలియదు నేను చెబితే నన్ను కావాలనే టార్గెట్ చేశారని ఆమె వెల్లడించింది. అసలు ఆయన నాకు తెలిసి ఉండే అవకాశం లేదు అయినా సరే కావాలని నన్ను ఆ ప్రశ్న అడిగి ఈ విషయాన్ని పెద్దది చేశారని ఆమె వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X