కారవాన్ల అరాచకాన్ని బయటపెట్టిన నిత్యా మీనన్..
Nithya Menon: తమిళ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డిఫెరెంట్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తన నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఇలా నేషనల్ వైడ్ గా ఫ్రేమ్ సంపాదించుకుంది నిత్యామీనన్. తాజాగా నిత్యామీనన్. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న పరిణామాలను పరిస్థితులను, స్త్రీ, పురుషుల మధ్య తేడాలను వెల్లడించింది. అసలేం జరిగిందో మీరు కూడా లూక్కేయండి.
నిత్యా మీనాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలు అందుకుంటూ దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'అలా మొదలైంది' సినిమాతో నిత్యా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. తొలి సినిమాతో రావడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ఈ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లో నటించి, మెప్పించింది నిత్యా మీనాన్.

నిత్యామీనన్ కెరీర్ లో తిరుచిత్రంబలం, ఓ కాదల్ కన్మణి, మెర్సల్, ఇష్క్, ఇడ్లీ కడై, ఉస్తాద్ హోటల్, గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్, కాంచన 2 సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే..'తిరుచిత్రంబలం' సినిమాలో తన నటనకు నిత్యా మీనన్ జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది. అలాగే 2019లో 'మిషన్ మంగళ్' చిత్రంలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తాజాగా నిత్యామీనన్ కాదలిక నేరమిల్లై సినిమాతో ముందుకు వస్తుంది. ఈ సినిమా ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ దర్శకత్వం వహించారు. 'కాదలిక నేరమిల్లై'సినిమా జనవరి 14న విడుదులైంది. ఈ మూవీ పాజివిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ఇక మరోవైపు నిత్యా మీనన్ ఓ నటిగా తాను ఎదుర్కొన్న అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది. నిత్యామీనన్ షూటింగ్ స్పాట్స్ లో తాను ఎన్నో ఇబ్బందికర విషయాలను పరిశీలించాలని, తాను కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎంతో కష్టపడి నటించినా తనకు ప్రశంసలు దక్కకపోవడంపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రజలు తనని ఇష్టపడే సన్నివేశాలలో తాను ఎంతో అద్భుతంగా నటించిన పెన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్న సందర్భాలను తాను ఎదుర్కొన్నని తెలిపారు.

అలాగే మెయిల్ క్యారెక్టర్స్ చేసే చిన్న పర్ఫామెన్స్లకు కూడా వారిని ఎంకరేజ్ చేసేవారని , అలాంటి సమయాలలో తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. అలాగే హీరోయిన్స్కు హీరోలకు కల్పించే సదుపాయాలని గురించి కూడా చర్చిస్తూ.. ఆడముగా అనే తేడా కూడా ఉంటుందని , మేల్ డామినేషన్ ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని, తన పెళ్లి గురించి వచ్చే వార్తల్లో నిజంలేదని తేల్చింది.


Click it and Unblock the Notifications











