విజయ్ సేతుపతి నన్ను ట్రై చేశాడు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన నిత్యా మీనన్
టాలెంటెడ్ అండ్ క్యూట్ హీరోయిన్ నిత్యా మీనన్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆమె టాలీవుడ్ లో నటించిన చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. విభిన్న పాత్రల్లో పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా గట్టిగానే సంపాదించుకుంది. అయితే నిత్యా మీనన్ నటించిన తాజా చిత్రం ప్రమోషన్స్ లో ఆమె విజయ్ సేతుపతిపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. తన పెళ్లి గురించి మాట్లాడే సమయంలో ఇలా మాట జారింది. ఆ వివరాల్లోకి వెళితే..
సార్ మేడమ్ చిత్రంతో..
కోలీవుడ్ లేటెస్ట్ ఫిల్మ్ సార్ మేడమ్. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈచిత్రంలో బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి జంటగా నటించారు. తమిళ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పించగా.. సత్య జ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మాతలు సెంథిల్ త్యాగరాజన్, అర్జన్ త్యాగరాజన్ నిర్మించారు. ఆగస్టు 01న ఈ చిత్రంతో తెలుగు, తమిళంలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మేకర్స్, చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. చిత్రంపై మరింతగా ఆసక్తిని పెంచుతున్నారు.

నిత్యా మీనన్ కామెంట్స్..
ఈ క్రమంలో నిత్యా మీనన్ తెలుగు వెర్షన్ సార్ మేడమ్ చిత్రాన్ని ప్రమోషన్స్ లో పాల్గొంది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో ఆమె ఆసక్తికరంగా మాట్లాడారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో నిత్యా మీనన్ పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా తెలుగు భాషలో చెప్పే క్రమంలో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడింది. 'నన్ను విజయ్ సేతుపతి, సార్ మేడమ్ మూవీ దర్శకుడు చాలా ట్రై చేశార'ని వ్యాఖ్యానించింది. దాంతో వెంటనే విజయ్ సేతుపతి సరిగా చెప్పమ్మ లేదంటే వేరే అర్థాలు వస్తాయని అల్టర్ చేశారు.
ఇక వెంటనే నిత్యా మీనన్ తన మాటలను వెనక్కి తీసుకుంది. నేను అలా అనలేదు. విజయ్ సేతుపతి, పాండిరాజ్ నన్ను పెళ్లి విషయంలో మోటీవేట్ చేస్తూ ఉంటారని చెప్పాలని అనుకున్నానని క్లారిటీ ఇచ్చింది. ఒక్కసారిగా నిత్యా మీనన్ తన మాటలతో విజయ్ సేతుపతిలో టెన్షన్ క్రియేట్ చేసింది. మొత్తానికి తన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏదేమైనా నిత్యా మీనన్, విజయ్ సేతుపతి చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరూ తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్, భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్న వారే కావడం విశేషం. ఇక నిత్యా మీనన్ తెలుగులో ఇప్పటికే అలా మొదలైంది, ఇష్క్, గుండె జారి గల్లంతైంది, అ, జనతా గ్యారేజీ, భీమ్లా నాయక్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక నిత్యా మీనన్ ఏకంగా 6 భాషల్లో మాట్లాడగలదు. నటిగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











