సెట్స్‌లో ఆయన ప్రవర్తన అలా.. ధనుష్‌పై విరుచుకుపడ్డ నిత్యామీనన్?
టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'అలా మొదలైంది' చిత్రం మొదలు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో చాలానే సినిమాలు చేసింది. అలా వచ్చి ఇలా పోవడం కాకుండా గుర్తుండిపోయే సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచుకుంది. నాని, నితిన్ వంటి హీరోలతో పాటు.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'భీమ్లా నాయక్'లోనూ నటించి మెప్పించింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే కన్నడ అందం ఆమె.
చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ... హీరోయిన్ గా మలయాళం, తమిళం, తెలుగులో గుర్తుండి పోయే సినిమాల్లో నటించింది. తన నటనతో ఇండస్ట్రీతోపాటు ఆడియెన్స్ లోనూ ఫేమ్ సంపాదించుకుంది. ఫ్యాన్స్ లోనూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. మంచి కథలను ఎంచుకుంటూ స్టార్స్ కు జోడీగా నటిస్తున్న నిత్యామీనన్ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడటం విశేషం. తెలుగులో ఈ ముద్దుగుమ్మ.. అలా మొదలైంది.. ఇష్క్, గుండె జారి గల్లంతైందే.. భీమ్లా నాయక్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే.. తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటించి ఆకట్టుకుంది. స్టార్ హీరోలకు ధీటుగా తన నటనతో బిగ్ స్క్రీన్ పై మేజిక్ చేసింది. సినిమాల ద్వారా నిత్యా మీనన్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. అలాగే.. సోషల్ మీడియాలోనూ పలు ఇంటర్వ్యూ ద్వారా కూడా హాట్ టాపిక్ గ్గా మారుతుంటుంది. ఇక తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ను ఉద్దేశించి పరోక్షంగా ఆమె చేసిన మాటలు వైరల్ గా మారాయి. నిత్యా మాటలు ఈ స్టార్ నే ఉద్దేశించి అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ నిత్యా మీనన్ ఏమన్నదనే విషయానికొస్తే... తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సినిమా సక్సెస్ అనేది అందులో భాగస్వామ్యులైన వారందరికీ వర్తిస్తుంది. కానీ కొందరు మాత్రం పైకే ఇలా మాట్లాడుతారు. గౌరవిస్తారు. కానీ సెట్స్ లో మాత్రం చాలా ఇగో ను ప్రదర్శిస్తుంటారు. వారి మాటలకు వారి ప్రవర్తనకు ఏమాత్రం సరిపోదు' అని చెప్పుకుంటూ వచ్చింది. అయితే నిత్య మీనన్ ఇండైరెక్ట్ గా సూపర్ స్టార్ ధనుష్ నే అంటుందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.
దీంతో కొందరు ఆమె మాటల్లో వాస్తవం లేదని.. ధనుష్ నే అని ఉంటే మాత్రం అందులో నిజం లేదని ఖండిస్తున్నారు. దానికితోడు ధనుష్ సానుకూలంగా స్పందించిన ట్వీట్లను ఆధారాలుగా చూపిస్తున్నారు. 'తిరుచిత్రంబలం' సినిమా తెలుగులో 'తిరు'గా విడుదలైంది. ఈ చిత్రంలో ధనుష్ కు ఫ్రెండ్ పాత్ర పోషించిన ఆమెకు ఏకంగా నేషనల్ అవార్డు సొంతమైంది. నిత్యాకు నేషనల్ అవార్డు రావడం పట్ల ధనుష్ ఎంతో సంతోషించారని తెలుపుతున్నారు.
అంతే కాకుండా.. ధనుష్ నిత్యా గురించి సక్సెస్ మీట్ వేదికలపై సానుకూలంగా మాట్లాడిన మాటలనూ గుర్తుచేస్తున్నారు. నిత్య అద్భుత నటన ప్రదర్శించడంతో తన పాత్ర మరింత పండిందని చెప్పుకొచ్చిన వీడియోను కూడా చూపిస్తున్నారు. అలాగే నిత్యా కూడా నేషనల్ అవార్డు వేడుకలోనే ధనుష్ తో మరో సినిమా చేయబోతున్నట్టు సంతోషంగా ప్రకటించిందని కూడా చెప్పే వీడియోలను వైరల్ గా చేస్తున్నారు. ఇక ధనుష్ తో నిత్యా మీనన్ 'ఇడ్లీ కడై' చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ దశలో ఉంది.


Click it and Unblock the Notifications











