పొట్టి బట్టలు, చేతిలో మందు గ్లాసుతో దేవుళ్లు పాప.. గ్లామర్ షోతో రెచ్చిపోయిందిగా!

చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు సినిమాల్లో హీరోయిన్ గా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. సినిమాల్లో హీరోయిన్లుగా అవకాశాలు అందుకుని తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. అయితే వాటి ఫలితం మాత్రం కొన్నిసార్లు బెడిసికొడుతోంది.

దీంతో ఆ ముద్దుగుమ్మలను పట్టించుకునే నాథుడు లేకుండాపోయింది.అందుకే మళ్లీ సినీ అవకాశాలు సాధించుకునేందుకు గ్లామర్ బాట పడుతున్నారు. అలా తాజాగా దేవుళ్లు సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న క్యూట్ బ్యూటి నిత్యా శెట్టి ఘాటు పోజులతో అట్రాక్ట్ చేసింది.

Actress Nithya Shetty

చైల్డ్ ఆర్టిస్ట్ గా: చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన నిత్యా శెట్టి హైదరాబాద్ లో జన్మించింది. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుకున్న ఈ బ్యూటి ఇన్ఫోసిస్ లో స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసింది. అయితే చిన్నతనంలోనే బాల నటిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ దక్కించుకోలేని పాపులారిటీని అందుకున్న విషయం తెలిసిందే. 2000 దశకంలో వరుస చిత్రాలతో బాలనటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

Actress Nithya Shetty

కోడి రామకృష్ణ డైరెక్షన్: నిత్యా శెట్టి బాల నటిగా 1999 సంవత్సరంలో చిన్ని చిన్ని ఆశ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా తర్వాత 2000వ సంవత్సరంలో ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవుళ్లు సినిమాలో నటించింది. ఇందులో బాలనటిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది నిత్యా శెట్టి. ఇందులో ఆమె నటనకు యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Actress Nithya Shetty

అవార్డ్స్ గెలిచి: దేవుళ్లు సినిమాలో నటనతో మంత్రముగ్ధులను చేసిన నిత్యా శెట్టి అదే సంవత్సరంలో లిటిల్ హార్ట్స్ అనే మరో చిత్రంలో నటించింది. ఇందులో కూడా నటనపరంగా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా లిటిల్ హార్ట్స్, చిన్ని చిన్ని ఆశ సినిమాలకు ఉత్తమ బాల నటిగా నంది అవార్డులను గెలుచుకుని సత్తా చాటింది నిత్యా శెట్టి.

చిరుతో మూవీ: అలా చిన్నతనంలో ఎవరూ అందుకోనివిధంగా నంది అవార్డు గెలిచి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది బ్యూటిఫుల్ నిత్యా శెట్టి. దీంతో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, నమ్రత శిరోద్కర్ నటించిన అంజి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాకు కూడా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.

Actress Nithya Shetty

సినిమాల లిస్ట్: ఇక అంజి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుంది నిత్యా శెట్టి. అనంతరం దాగుడుమూత దండాకోర్ (2015), పడేసావే (2016) వంటి తెలుగు చిత్రాల్లో సైడ్ రోల్స్ చేస్తూ అట్రాక్ట్ చేసింది. అనంతరం హిందీ, తమిళ చిత్రాలు కూడా చేసి ఆశ్చర్యపరిచింది ఈ చిన్నది. ఇవే కాకుండా మాయ, ఐవారట్టం, కాదల్ కాలమ్, అఘావాన్, నువ్వు తోపురా, ఓ పిట్ట కథ, వాంటెడ్ పండుగాడ్ వంటి మూవీస్ చేసింది.

మందు గ్లాసుతో: ప్రస్తుతం సినీ అవకాశాలు అంతగా లేని నిత్యా శెట్టి సోషల్ మీడియాలో ఓవర్ గా గ్లామర్ షో చేస్తుంటుంది. తాజాగా పొట్టి బట్టలు వేసుకుని కింద పడుకుని చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ఘాటు పోజులు ఇచ్చింది. ఇందులో ఆమె అందాలు నెటిజన్లందరినీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆ పిక్స్ వైరల్ గా మారాయి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X