ప్రేమించి మోసపోయాను.. నా ఫ్రెండే నా లవర్‌తో.. యంగ్ హీరోయిన్ షాకింగ్‌గా
చూపు తిప్పుకోకుండా చేసే అందం, అద్భుతమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్. తమిళం నుంచి సినీ ప్రయాణం మొదలు పెట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి సత్తా చాటింది. ఇలా చాలా కాలంగా తనదైన చిత్రాలను చేస్తూ మరిన్ని ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నివేదా పేతురాజ్ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
అలా ఎంట్రీ.. మెంటల్‌గా
నివేదా పేతురాజ్ 2016లో వచ్చిన 'Oru Naal Koothu' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత అదే భాషలో 'Podhuvaga En Manasu Thangam' అనే సినిమా చేసి ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 2017లో వచ్చిన 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంటరై ఎనలేని గుర్తింపును అందుకుంది.

తెలుగులో వరుస హిట్లు
టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన కొత్తలోనే ఓ రేంజ్‌లో పాపులర్ అయిన నివేదా పేతురాజ్.. ఆ తర్వాత 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'అల.. వైకుంఠపురములో', 'రెడ్' అనే సినిమాలు చేసింది. ఇవన్నీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు కూడా వచ్చింది. కానీ, ఆఫర్లు మాత్రం అనుకున్నట్లుగా దక్కట్లేదు.
ఆ సినిమాలతో సందడి
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న నివేదా పేతురాజ్.. ఆ మధ్య విశ్వక్ సేన్‌తో 'పాగల్' అనే చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే గత ఏడాది 'దాస్ కా ధమ్కీ' అనే చిత్రంతో మరోసారి అతడితో జతకట్టి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నివేదా 'భూ' అనే సినిమా చేసింది. ఇక, ఇప్పుడు ఈ అమ్మడు 'పార్టీ' అనే తమిళ చిత్రాన్ని చేస్తోంది.

ఆ వీడియోతో సెన్సేషన్
నివేదా పేరురాజ్‌కు అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్నా అవకాశాలు మాత్రం ఆశించిన విధంగా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఆమె 'పరువు' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. దీనికోసం ఓ ప్రమోషనల్ వీడియో చేసింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. ఇక, ఈ వెబ్ సిరీస్ సైతం మంచి ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్ సాధించింది.
ప్రేమలో మోసపోయాను
మంచి మంచి ఆఫర్లతో సత్తా చాటుతోన్న నివేదా పేతురాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. 'నేను ప్రేమించి మోసపోయాను. కాబట్టి ఎవరూ తొందడపడి ప్రేమలో పడకండి. పడినా కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండే నా లవర్‌ను తీసుకుని వెళ్లిపోయింది. ఆ అనుభవంతోనే చెప్తున్నాను' అని చెప్పింది.

సూపర్ పవర్స్ ఉన్నాయి
నివేదా పేరురాజ్ కంటిన్యూ చేస్తూ.. 'నా లవ్ ఫెయిల్ అవడంతో చాలా డిస్టర్బ్ అయ్యాను. అయితే, ఇదంతా జరుగుతుందని నాకు ముందే కల వచ్చింది. కానీ నేను నమ్మలేదు. తర్వాత ఇదే తరహాలో కలలు రావడం.. అవే నిజంగా జరగడం అయింది. ఒక్కోసారి ఇది ఆలోచిస్తుంటే నాకు సూపర్ పవర్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది' అంటూ కొత్త విషయాన్ని బయటపెట్టింది.


Click it and Unblock the Notifications











