నివేదా థామస్‌ను కంటతడి పెట్టించిన నాని!
అందం, అభినయం కలగలిసి మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్. ఏ రోల్ ఇచ్చిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో ఈవిడ దిట్ట. నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నివేదా. నిన్నుకోరి, జైలవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118, బ్రోచేవారెవరు రా సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నివేదా. తర్వాతి రోజుల్లో తెలుగు తెరకు దూరమైన ఆమె లాక్‌డౌన్ సమయంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌లో తళుక్కున మెరిశారు. ఆ వెంటనే శాకినీ డాకినీ అంటూ పలకరించి మళ్లీ గ్యాప్ ఇచ్చారు.
తాజాగా నివేదా థామస్ తెలుగులో నటిస్తోన్న చిత్రం 35 చిన్న కథ కాదు. నంద కిశోర్ దర్శకత్వంలో రానా, సృజన్ యరబోలు, సిద్ధార్ధ్ రాళ్లపల్లి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌లు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో నివేదా థామస్ ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తున్నారు. 28 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆమె ఈ రోల్ పోషించడం సాహసమనే చెప్పాలి. ఆమె గట్స్‌కు , వృత్తిపట్ల నివేద అంకితభావానికి నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే.

మరోవైపై 35 చిన్న కథ కాదు సినిమాలో తన పాత్ర కోసం నివేదా థామస్ భారీగా బరువు పెరిగారు. విద్యావ్యవస్ధ, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్ వంటి బంధాల గురించి చాలా అద్భుతంగా ఈ సినిమాలో వివరించారని నివేదా తెలిపారు. తెరపై సినిమా చూస్తున్నంత సేపూ కే . విశ్వనాథ్ సినిమా చూస్తున్నట్లుగా ఉంటుందని నివేద అన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే హేమ కమిటీ రిపోర్ట్ వెలుగులోకి రావడంపై ఆమె స్పందించారు. చిత్ర పరిశ్రమలో హేమ లాంటి కమిటీలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించడం అవసరమని, దీని గురించి నేనూ కమిటీకి సూచించానని నివేదా థామస్ తెలిపారు.
సెప్టెంబర్ 6న 35 చిన్న కథ కాదు సినిమా తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. నివేదా థామస్‌తో తొలి నుంచి ఆయనకు మంచి అనుబంధం ఉండటంతో హీరో నాని ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నాని.. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నివేదాను ఆకాశానికెత్తేశారు. తల్లిదండ్రులు పిల్లల్ని కచ్చితంగా తీసుకుని వెళ్లి చూపించాల్సిన సినిమా అన్నారు. జెంటిల్‌మెన్ నుంచి నివేదాతో పరిచయం ఉందని.. ఆమె పొరపాటున కూడా అబద్ధం చెప్పదన్నారు. థియేటర్లలో నివేదాను చూస్తే ప్రతి తల్లి కనెక్ట్ అవుతుందన్నారు నాని. ఆమె తన ఇంట్లో మనిషి అయిపోయిందని, కొంతమంది ఉంటారని వాళ్లకు ఏ పని ఇచ్చినా బాగా చేస్తారని అలాంటి వారిలో నివేదా ఒకరని కొనియాడారు. యాక్టింగే కాదు ఏ పని అప్పగించినా నివేదా థామస్ 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తుందని నాని ప్రశంసించారు. నాని వ్యాఖ్యలతో నివేదా థామస్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు కళ్లు తుడుచుకుంటూనే కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











