వర్క్ ప్లేస్ లో అలాంటివి దారుణం.. హేమ కమిటీ పై నివేదా థామస్ షాకింగ్ కామెంట్స్
వెరుథె ఒరు భార్య, మధ్య వెనాల్ వంటి మలయాళం చిత్రాలతో బాలనటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నివేదా థామస్. తర్వాత జెంటిల్‌మెన్ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టి.. నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది. అనంతరం నిన్ను కోరి, జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, దర్బార్, వకీల్ సాబ్, శాకిని డాకిని, 35 చిన్న కథ కాదు వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఇకపోతే మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక ఆరోపణలు సోషల్ మీడియాలో దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. నటీమణులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి వేధింపులు ఎదుర్కున్నారో రీసెంట్‌గా హేమా కమిటీ వెల్లడించింది. దీంతో ఒక్కొక్కరూ మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, వేధింపులను వెల్లగక్కుతున్నారు.
ఆల్రేడీ కొంతమంది సినీ నటుల మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయని నెట్టింట వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై హీరోయిన్ నివేదా థామస్ స్పందించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరగడం చాలా బాధాకరమని తను నటించిన 35 చిన్న కథ కాదు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చింది. హేమా కమిటీ రిపోర్ట్‌లో తెలిపిన విషయాల గురించి తమ ఇంట్లో కూడా డిస్కస్ చేశానని పేర్కొంది. సినీ ఇంస్ట్రీలో జరిగే ఇలాంటి ఘటనలపై బయట కూడా చాలా మందితో మాట్లాడనని తెలిపింది. వర్క్ ప్లేస్‌లో లైంగిక వేధింపులు దారుణం, మహిళలకు సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలని చెప్పింది. అక్కడ మహిళలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంది.

ప్రజెంట్ డేస్‌లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఇంట్లో కన్నా వర్క్ ప్లేస్‌లో ఎక్కువగా ఉంటున్నామని వెల్లడించింది. కాగా అక్కడ మహిళలకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని, ప్రజెంట్ నివేదా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ లో మెంబర్‌గా ఉన్నానని 35 చిన్న కథ కాదు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా థామస్ చెప్పుకొచ్చింది. ఇక ఈ బ్యూటీ నటించిన 35 చిన్న కథ కాదు చిత్రం నుంచి రీసెంట్‌గా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి, విశ్వ కీలక రోల్‌లో మెరవనున్నారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక :
మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి కేరళ గవర్నమెంట్ హేమా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌కు రిటైర్డ్ హైకోర్టు జడ్జికే హేమ నాయకత్వం వహించారు. నటి శారదతోపాటు మాజీ సివిల్ సర్వీస్ అఫిషియల్ కేబీ వాత్సల కుమారి ఆ కమిషన్‌లో సభ్యులుగా వ్యవహరించారు. ఈ కమిషన్ ఇటీవలే తన నివేదికను సీఎం విజయన్‌కు అందించింది. ఈ రిపోర్టులో షాకింగ్ నివేదిక వెల్లడించింది. అవకాశాల పేరిట మహిళ ఆర్టిస్టులను లొంగదీసుకున్నారనీ, లొంగని వారిని ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని పలు సంచనాలను వెల్లడించింది. కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ అందరూ ఒక టీంగా ఏర్పడ్డరని కమిటీ నివేదిక లో ఆరోపించింది.

'అమ్మ'కు మోహన్‌లాల్ రాజీనామా
కేరళ ప్రభుత్వానికి హేమ కమిటీ నివేదిక అందించిన నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (AMMA)అధ్యక్షులు మోహన్ లాల్ తన పదవీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మొత్తం 17 మంది అసోషియన్ మెంబర్స్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు నెలల్లోగా కొత్త పాలక మండలిని ఎన్నుకుంటామని అసోసియేషన్ ఇటీవలే ప్రకటించింది. మరో సంచలన విషయమేమింటంటే.. AMMA మెంబర్లు గా ఉన్నా దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం మరో ట్వీస్ట్.


Click it and Unblock the Notifications











